టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమా ఏదైనా ఉంది అంటే అది మహేశ్ బాబు సినిమాను రాజమౌళి సినిమా అనే చెప్పాలి. తన సెంటిమెంట్ కు భిన్నంగా రాజమౌళి ఈసారి సెలెన్స్ మెంటైన్ చేస్తు సినిమాను స్టార్ట్ చేసాడు. అందుకు కారణాలు ఏంటనేది పక్కన పెడితే అసలు ఎస్ఎస్ఆర్ఎంబీ ప్రజెంట్ స్టాటస్ ఏంటని ఆరా తీసే పనిలో ఉన్నారు ఘట్టమనేని అభిమానులు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రాజమౌళి ఈ సినిమా షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నాడట. ఇటీవలే ఎస్ఎస్ఆర్ఎంబీని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. కానీ జక్కన్న టీమ్ నుంచి ఎలాంటి ఫోటోలు బయటికి రాలేదు.
Also Read : Seerat Kapoor : ఎద అందాలతో చలిలో చెమటలు పుట్టిస్తోన్న సీరత్ కపూర్
అయితే లాంచ్ చేయడమే లేట్ అన్నట్టుగా ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసినట్టుగా ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌లో కీలక సన్నివేశాలు ఫినిష్ చేసినట్టు తెలిస్తోంది. అంతేకాదు తాజాగా ఈ సినిమా మరో కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేసాడు రాజామౌళి. గడచిన ఆదివారం నుండి ఈ షెడ్యూల్‌లో మహేశ్ బాబుతో పాటు హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా పాల్గొంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం రాజమౌళి ఈ చిత్రాన్ని నాన్‌స్టాప్ షెడ్యూళ్లతో శరవేగంగా పూర్తి చేయాలనే ప్లాన్ చేస్తున్నాడు. ఏడాదిన్నర సమయంలోనే మహేశ్ సినిమాను రాజమౌళి పూర్తి చేస్తారని అందుకు తగ్గట్టే జక్కన్న జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నట్టే కనిపిస్తోంది. మరోవైపు తమ హీరో సినిమాకు సంబంధించి ఎదో ఒక అప్డేట్ ఇవ్వాలని సూపర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్న కూడా జక్కన్న సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ షూట్ ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నాడు.