దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ డ్రామా “ఆర్.ఆర్.ఆర్”. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవ్‌గన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఇటీవలే రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ పూర్తయ్యిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తేలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చింది. జూలై 6 నుండి “ఆర్ఆర్ఆర్” చివరి దశ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సాంగ్స్ మేకింగ్ కోసం భారీ సెట్లను నిర్మించారట. మొదటి పాట జూలై 10 నుండి, రెండవ పాట నెల చివరి నుండి చిత్రీకరించబడతాయి. అందులో ఒక సాంగ్ ఎన్టీఆర్, అలియా భట్ లపై ఉంటుందని తెలుస్తోంది. ఆగస్టు మొదటి వారంలో మొత్తం సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.
Read Also : అప్పుడే మొదలెట్టేసిన మెగా అభిమానులు…!!
ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబందించిన మిగతా పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్ సిజిఐ వర్క్ పలు స్టూడియోలలో పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ఈ విషయాలను ప్రముఖ రచయిత కె.వి.విజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఇంకా ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుందని స్పష్టం చేశారు. అనుకున్న సమయానికే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం “ఆర్ఆర్ఆర్” కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులను గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళం, హిందీ, మలయాళం, కన్నడతో సహా పలు భాషల్లో విడుదల కానుంది.