ప్రభాస్ ప్రస్తుతం ఇటలీలో వెకేషన్లో ఉన్నాడు. నిజానికి, ఇటలీలోని ఒక పల్లెటూరిలో ఒక నివాసాన్ని కొనుగోలు చేసిన ప్రభాస్, ఎప్పుడు ఖాళీ దొరికినా అక్కడికే వెళ్తున్నాడు. మోకాలి శస్త్రచికిత్స తర్వాత కాస్త విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో, సినిమా షూటింగ్‌లన్నింటికీ విరామం ఇచ్చి అక్కడికి వెళ్లి, ప్రస్తుతం రెస్ట్ మూడ్‌లో ఉన్నాడు. అయితే, ఆయన చేస్తున్న సినిమాల గురించి అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
Read More:Suriya: సూర్య -వెంకీ సినిమాకి రికార్డ్ బడ్జెట్?
అదేమిటంటే, ప్రభాస్ అన్ని సినిమాల కంటే ఎక్కువగా ప్రశాంత్ వర్మ చెప్పిన బ్రహ్మ రాక్షస అనే స్క్రిప్ట్‌కు బాగా ఆకర్షితుడయ్యాడని, మిగతా సినిమాలన్నీ పక్కనపెట్టి ఆ సినిమాను ముందుగా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే, అది కేవలం పుకారేనని తెలుస్తోంది. ప్రస్తుతానికి స్పిరిట్ సినిమా మాత్రమే ప్రభాస్‌కు టాప్ ప్రయారిటీగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన సందీప్ రెడ్డి వంగాతో కలిసి పనిచేయడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నాడు. స్పిరిట్ సినిమాలో ఒక పోలీస్ అధికారి పాత్రలో కనిపించాల్సి ఉండడంతో, ఆయన అందుకోసం శరీరాన్ని సిద్ధం చేసుకునే పనిలో పడ్డాడు.
Read More: Prabhas: మరోసారి ప్రభాస్‌తో దీపికా?
ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా ఏడు నెలల పాటు తేదీలను కేటాయించాడు. దీనికంటే ముందు, ప్రభాస్ రాజా సాబ్ పెండింగ్ భాగాలతో పాటు హను రాఘవపూడి ఫౌజీ సినిమా షూటింగ్‌ను కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత, స్పిరిట్ పూర్తయిన వెంటనే సలార్ 2 మరియు కల్కి 2898 ఏడి సీక్వెల్ సినిమాలను కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రభాస్‌కు స్పిరిట్ టాప్ ప్రాధాన్యత అని చెబుతున్నారు.