Suriya: సూర్య -వెంకీ సినిమాకి రికార్డ్ బడ్జెట్?
- రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య
- తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో చేయబోతున్న సూర్య
- ఈ సినిమాకి రికార్డ్ బడ్జెట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా సూర్య రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ విషయంలో ఓపెనింగ్స్ నిలబెట్టినా, సినిమా లాంగ్ రన్‌లో కష్టమేననే మాట వినిపిస్తోంది. ఆ సంగతి పక్కనపెడితే, సూర్య తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో చేయబోతున్నాడు. తెలుగులో కొన్ని సినిమాలు చేసిన వెంకీ అట్లూరి, తమిళ హీరో ధనుష్‌తో సార్, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో లక్కీ భాస్కర్ సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకున్నాడు.
Read More:Prabhas: మరోసారి ప్రభాస్‌తో దీపికా?
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ఇప్పుడు ఆయన సూర్యతో సినిమా చేయబోతున్నాడు. లక్కీ భాస్కర్ సినిమా అద్భుతంగా నచ్చడంతో పాటు, వెంకీ చెప్పిన కథ కూడా బాగా నచ్చడంతో సూర్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త తెరమీదకు అచ్చింది. అదేమంటే, ఈ సినిమాకి 120 కోట్ల రూపాయల బడ్జెట్ ఫిక్స్ చేసుకున్నారని, అందులో 50 కోట్ల రూపాయలు కేవలం సూర్య రెమ్యూనరేషన్‌గా ఉండబోతున్నాయని అంటున్నారు. అయితే, సూర్య ట్రాక్ రికార్డ్‌ను బట్టి పరిశీలిస్తే, ఇది బాగా భారీగా ఖర్చు పెట్టబోతున్న సినిమాగా నిలవబోతుంది.
Read More:Sudheer Babu : ‘జటాధర’ మూవీలో మహేష్ బాబు మరదలు..!
ఎందుకంటే, సూర్య సాలిడ్ హిట్స్ కొట్టి కొన్ని ఏళ్ళు అవుతోంది. అయినప్పటికీ, ఇండియన్ సినిమా చరిత్రలో అద్భుతమైన నటీనటులలో సూర్య కూడా ఒకరు. నిజానికి, డైరెక్ట్ తెలుగు సినిమా చేయడానికి చాలా కాలంగా సూర్య ప్రయత్నిస్తున్నాడు. చివరకు ఈ సినిమా దొరకడంతో, ఆయన ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమా చేసి, దాన్ని తమిళంలో కూడా రిలీజ్ చేయబోతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించబోతున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించబోతున్నాడు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!