స్టార్ హీరోయిన్ తమన్నా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న తన హవా ఏమాత్రం తగ్గడం లేదు. మరి ముఖ్యంగా ఈ మధ్య గ్లామర్ రోల్స్, లిప్ లాక్స్.. అంటూ హద్దులు చెరిపేసింది. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా ఈ అమ్మడు, ఎలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేయడానికైనా రెడీ అంటుంది. అలా ఇప్పటి వరకు ‘అరణ్మననై 4’ లో దెయ్యం రోల్, ‘లస్ట్ స్టోరీస్ 2’ లో కూడా కొంచెం అలాంటి పాత్రలో నటించింది. ‘జైలర్’, ‘స్త్రీ 2’ వంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ కూడా చేసింది. ఇక ఇప్పుడు ‘ఓదెల 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది తమన్న.
Also Read: Surya : ‘రెట్రో’ నుంచి మరో సాంగ్ విడుదల
‘ఓదెల రైల్వే స్టేషన్’ గతంలో ఓటీటీలో పెద్ద హిట్ కావడంతో, ఆ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ‘ఓదెల 2’ను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సంపత్ నంది నిర్మింస్తుండగా, ఇక ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తవ్వగా, తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు మేకర్స్. ముందు నుంచి అన్నట్లుగానే ఈ ఏప్రిల్ 17 న ‘ఓదేల 2’ రిలీజ్ అంటూ, తమన్న పవర్ ఫుల్ పోస్టర్ తో అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ నెల ఆఖరిలో ప్రొమోషన్స్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తోందట చిత్రబృందం. మొత్తనికి ఈ థ్రిల్లింట్ మూవీ ఏప్రిల్ 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
#Odela2 GRAND RELEASE WORLDWIDE ON APRIL 17th ! pic.twitter.com/AS0NY9y5Ra
— Rajesh Manne (@rajeshmanne1) March 22, 2025