ఆకాశమే హద్దురా, గురు వంటి చిత్రాలను తెరకెక్కించిన సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా ‘పురాణనూరు’ అనే భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ సినిమాకు ఆది నుండి అవరోధాలు ఎదురవుతున్నాయి. మొదట ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్య తీసుకున్నారు. కానీ అనుకోని కారణాల వలన ఈ సినిమా నుండి సూర్య తప్పుకోవడంతో శివకార్తికేయన్ వచ్చి చేరాడు. ఇక హీరోయిన్ గా మొదటి మలయాళ భామ నజ్రియాను ఎంపిక చేసారు, డేట్స్ ఎడ్జస్ట్ కాకపోవడంతో టాలీవుడ్ డాన్సింగ్ డాల్ శ్రీలీలను కథానాయికగా తీసుకున్నారు. ఇందుకు సంభందించి ఫోటో షూట్ కూడా కంప్లిట్ చేసారు.
Also Read : Rajnikanth : హాస్పిటల్ నుండి సూపర్ స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్..!
కాగా ఈ సినిమలో శివకార్తికేయన్ బ్రదర్ గా మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఫస్ట్ ఛాయిస్ గా ఎంపిక చేసారు, అందుకు దుల్కర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు దుల్కర్ ఈ సినిమా నుండి వైదొలిగాడు ఈ ప్లేస్ లో తమిళ హీరో అథర్వను తీసుకున్నారు. ఇక విలన్ రోల్ కోసం తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ నటిస్తున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ లోకేష్ తప్పుకున్నాడని విజయ్ వర్మ పేరు వినిపించగా లేటెస్ట్ గా ఈ పాత్ర కోసం మలయాళ నటుడు రోషన్ మాత్యు కు ఫిక్స్ చేసారు. దర్శకురాలు తప్ప మిగతా టీమ్ అంతా మార్చిన ఈ సినిమా రెగ్యులర్ షూట్ జనవరిలో స్టార్ట్ కానుంది.శివకార్తికేయన్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ 25వ సినిమాగా రానుంది పురాణనూరు. తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్న శ్రీలీల అక్కడ మేరకు రాణిస్తుందో.