Naga Vamsi donating Rs. 5 lakhs for Wayanad landslides Relief Fund: కేరళలోని వాయనాడ్ జిల్లాలోని చూరల్‌మల వద్ద కొండచరియలు విరిగిపడటంతో వందలాది మంది మరణించారు, వందలాది మంది గాయపడ్డారు. రెండు రోజులుగా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు మలయాళ, తమిళ సినీ ప్రముఖులు సహాయ కార్యక్రమాలకు విరాళాలు అందజేశారు. తమిళ నటులు సూర్య, ఆయన భార్య జ్యోతిక, కార్తీ కలిసి కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షల విరాళం అందించారు. అయితే ఇప్పటి వరకు ఏ తెలుగు నటుడూ విరాళం ప్రకటించ లేదు. కొంతమంది తెలుగు స్టార్ హీరోలు ఇటీవలి కాలంలో కేరళలో మంచి ఫాలోయింగ్ సంపాదించారు.
Malvi Malhotra: రాజ్ తరుణ్ కి మాల్వీ మల్హోత్రా వార్నింగ్.. ఏంటో తెలుసా?
ఈ క్రమంలో రానున్న రోజుల్లో విరాళాలు ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఇక తెలుగు సినీ పరిశ్రమ నుంచి ముందుగా నాగవంశీ తన నిర్మాణ సంస్థ తరపున 5 లక్షలు విరాళం ప్రకటించారు. యనతార, విఘ్నేష్ శివన్ 20 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. తమిళ స్టార్ విక్రమ్ బాధితులకు రూ.20 లక్షల విరాళం అందించారు. కేరళలోని వాయనాడ్ జిల్లాలో ఇటీవల కొండచరియలు విరిగిపడటం వల్ల సంభవించిన విధ్వంసంలో 150 మందికి పైగా మరణించారని, 197 మంది గాయపడ్డారని, మరికొందరు గల్లంతయ్యారని చెబుతున్నారు. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగించే అంశం.