శ్రీ విష్ణు హీరోగా వచ్చిన “సింగిల్” సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సినిమాలో కామెడీకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. శ్రీ విష్ణు సింగిల్ లైనర్స్, కామెడీ టైమింగ్ సినిమాకి బాగా కలిసి వచ్చింది. అలాగే శ్రీ విష్ణుతో వెన్నెల కిషోర్ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయిన నేపథ్యంలో సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. నిజానికి శ్రీ విష్ణు చివరిగా నటించిన “స్వాగ్” సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
Read More:Samantha- Sree Vishnu: సమంత ‘శుభం’ని డామినేట్ చేస్తున్న ‘#సింగిల్’ శ్రీవిష్ణు
అయినా సరే, దాంతో సంబంధం లేకుండా ఈ సినిమాకి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ పోస్టర్ కూడా సినిమా యూనిట్ విడుదల చేసింది. మొదటి రోజు నాలుగు కోట్ల పదిహేను లక్షలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సినిమా టీం వెల్లడించింది. ఇక పాజిటివ్ మౌత్‌టాక్ ఉండడంతో రెండో రోజు, మూడో రోజు అద్భుతమైన కలెక్షన్స్ రాబడతామని ఆశాభావం వ్యక్తం చేసింది.
Read More: Nani: పాకిస్తాన్ వాళ్లకు ఆ కిక్ ఉండకూడదనే.. సక్సెస్ మీట్ పెట్టా
ఇక ఇప్పటికే ఈ సినిమా అమెరికాలో $150K కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన కేతిక శర్మ, ఇవాన హీరోయిన్లుగా నటించారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులతో పాటు యూత్‌కి ఎక్కువగా కనెక్ట్ అవుతోంది. తమిళ దర్శకుడు రాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి నందు, భాను టీం డైలాగ్స్ అందించింది. ఆ డైలాగ్స్, సింగిల్ లైనర్స్ బాగా ప్రేక్షకులకు వర్కౌట్ అయ్యాయి.