నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమా మే ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నాని కెరీర్‌లోనే అత్యంత వైలెంట్ సినిమాగా రూపొందించబడిన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్లు దాటి 150 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటివరకు ఈ సినిమాను అమెరికాలో ప్రమోట్ చేస్తూ వచ్చిన నాని తాజాగా ఇండియా వచ్చాడు. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
Read More:Rajnath Singh: పాకిస్తాన్ తాట తీయాల్సిందే.. సైన్యానికి కీలక ఆదేశాలు
అయితే, ఇండియా-పాకిస్తాన్ మధ్య అప్రకటిత యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ సక్సెస్ మీట్ నిర్వహించాలా వద్దా అని ముందు తర్జన భర్జనలు పడ్డామని నాని చెప్పుకొచ్చాడు. అయితే, పాకిస్తాన్ ఇండియాలో ఉన్న వారి మనశ్శాంతిని దూరం చేయాలనుకుంటోంది. వారి భయానికి దక్షిణ భారతదేశంలో ఒక సినిమా సక్సెస్ మీట్ క్యాన్సిల్ అయిందనే సంతృప్తి వారికి ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఇప్పుడు సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు.
Read More:OperationSindhoor: పాక్ ఆర్మీ చీఫ్ కు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్..
శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ చిత్రం కేవలం ఫ్యామిలీ ఆడియన్స్‌ను మాత్రమే కాకుండా బీ, సీ సెంటర్లను టార్గెట్ చేసుకొని చేశారు. ఎవరినైతే టార్గెట్ చేసుకొని సినిమా చేశారో, ఆ టార్గెట్ బాగానే వర్కౌట్ అయింది. నానిని ఇంత వైలెంట్‌గా ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని సినిమా చూసిన వారంతా కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద పాకిస్తాన్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో నాని నిర్వహించిన సక్సెస్ మీట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే, ఎప్పుడో 16వ తేదీన జరగాల్సిన థర్డ్ లైఫ్ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‌ను కమల్ హాసన్ క్యాన్సిల్ చేశారు. కానీ, నాని నిన్నటికి నిన్న అప్పటికప్పుడు అనుకుని ఈ ఈవెంట్ నిర్వహించడం హాట్ టాపిక్ అయింది.