టాలీవుడ్ యాక్షన్ హీరో అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’. ఓ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు డైరెక్టర్ షేనియల్ డియో దర్శకత్వం వహిస్తుండగా.. ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆ కాంబినేషన్‌పై మంచి ఆసక్తి నెలకొంది. అయితే ప్రారంభంలో ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ ఎంపికయ్యారు. కొంతవరకు షూటింగ్ కూడా జరుపుకోగా, అనుకోని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో ఇండస్ట్రీలో ‘డెకాయిట్’ యూనిట్‌తో శ్రుతికి విభేదాలే కారణమా? అనే గాసిప్స్ మొదలయ్యాయి. కానీ తాజాగా ఈ వార్తలపై స్పందించిన హీరో అడివి శేష్ స్పష్టతనిచ్చారు..
Also Read : Jagapathi Babu : బుల్లితెరపై కొత్త అవతారంలో జగ్గూభాయ్..
‘శ్రుతి హాసన్‌కి డేట్స్ అడ్జస్ట్ చేసుకోవడంలో చాలా ఇబ్బందులు వచ్చాయి. ఆమె అప్పటికే ‘కూలీ’ అనే చిత్రంలో బిజీగా ఉండటంతో మా సినిమాలో పూర్తిస్థాయిలో పాల్గొనలేక పోయింది. దీంతో ఆమె ‘డకాయిట్’ నుంచి తప్పుకుంది. ఈ వ్యవహారంలో ఎటువంటి విబేధాలు కానీ గొడవలు కానీ లేవు’ అంటూ ఆయన తెలిపారు. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుండగా, అడివి శేష్‌తో ఆమె స్క్రీన్ కేమిస్ట్రీ ఎలా ఉండబోతుందన్న దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.