టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది శృతి హాసన్. అనతి కాలంలోనే భాషతో సంబందం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది. ప్రజంట్ తెలుగు, తమిళ, హింది, ఇంగ్లీష్ ఇండస్ట్రీలలో తనదైనా మార్క్ క్రియేట్ చేసుకుంటుంది. అయితే ఇండస్ట్రీ ఏదైనప్పటికి నటీమణుల తొలి సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతే, వారిపై తక్షణమే విమర్శలు మొదలవుతాయి. ‘ఐరన్ లెగ్’ అనే అనుచితమైన లేబుల్ వేసి, సినిమా ఫలితం వారిపై మోపడం సాధారణమైంది. కానీ హీరోల విషయంలో మాత్రం దాని గురించి అంతగా పట్టించుకోరు. నటీమణుల పట్ల ఈ వివక్షత శ్రుతి హాసన్ కూడా కెరీర్ ప్రారంభంలోనే ఎదుర్కొందట.. తాజాగా
Also Read : Sandeep Reddy Vanga: ‘అర్జున్ రెడ్డి’లో ఓ డ్రీమ్ సీన్ బడ్జెట్ వల్ల వదిలేశా..
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రుతి, తన బిగినింగ్ జర్నీ గురించి మాట్లాడుతూ.. “గత ఫలితాల్ని పక్కనపెట్టి, నాపై నమ్మకంతో ‘గబ్బర్ సింగ్’లో అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, హరీష్ శంకర్ గారికి కృతజ్ఞతలు. నన్ను వారు నమ్మి మంచి అవకాశం ఇచ్చారు. అదృష్టవంతురాలు లేదా దురదృష్టవంతురాలు అని పిలవడం నాకు ఇష్టం ఉండదు. నేను నా పనిని ప్రేమిస్తున్నాను. నటన పట్ల నా అభిరుచి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. బాక్సాఫీస్ వద్ద ‘3’ మూవీ పెద్దగా ఆడకపోయినా, ‘కొలవెరి డి’ పాట మాత్రం ఘన విజయాన్ని సాధించింది. నేటి ఓటీటీ, పాన్ ఇండియా ట్రెండ్‌లో ఆ సినిమా విడుదలై ఉంటే, అది పెద్ద హిట్ అయ్యేదని నమ్ముతున్నాను’ అని అన్నారు.
అలాగే శ్రుతి హాసన్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో ప్రీతి అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా ఈ మూవీ గురించి కూడా మాట్లాడుతూ.. ‘ఒక మ్యూజిక్ వీడియో పనిలో ఉన్నప్పుడు, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కథ చెప్పగా, వెంటనే స్క్రిప్ట్ నచ్చి ఒప్పుకున్నాను. ఈ సినిమాలో సీనియర్ నటుడు సత్యరాజ్ కుమార్తెగా నటిస్తున్నాను. ఇది నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన పాత్ర’ అని చెప్పారు.