‘Shivam Bhaje’ amasses 100M streaming minutes on Amazon Prime, Aha: అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘శివం భజే’. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ మీద అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో ఇటీవల అమెజాన్ ప్రైం మరియు ఆహా లో విడుదలైన కొన్ని రోజుల్లోనే ‘100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్’ సాధించడం విశేషం.
Nindha: ఓటీటీలో రచ్చ రేపుతున్న వరుణ్‌సందేశ్ ‘నింద’
మల్టీ జానర్ కథతో, అందరినీ ఆకట్టుకునే అంశాలతో పాటు డివైన్ ఎలిమెంట్ కూడా ఉత్కంఠ రేపే విధంగా ఉండటంతో వీక్షకులు ఓటిటిలో కూడా ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలో కంటెంట్ బాగుంటే, చిత్రం పెద్ద తెర నుండి చిన్న తెర వరకు ఎక్కడున్నా ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది అని నిర్మాత సంతోషం వ్యక్తం చేశారు. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించిన ఈ చిత్రంలో అర్బాజ్ ఖాన్, దిగంగన సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీనా, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, షకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన వంటివారు నటించారు.