కొంతమంది హీరోయన్‌లు వంద సినిమాలు చేసిన కూడా గుర్తింపు మాత్రం రాదు. కానీ ఇంకొంత మంది హీరోయిన్‌లు మాత్రం మొదటి చిత్రం తోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు అందులో షాలినీ పాండే ఒక్కరు. హీరోయిన్ అవ్వాలి అనే తన కల నెరవేర్చుకోవడం కోసం ఇంటి నుంచి వచ్చేసిన ఈ అమ్మడు 2017లో విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ మూవీతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే గుర్తింపు తెచ్చుకున్న షాలినీ ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు, సిరీస్లు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది. ఇక ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి అడుగు పెట్టడం వల్ల, కెరీర్ ఆరంభంలో తాను కూడా అందరిలాగే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది షాలినీ..
Also Read: Akhil : సాలిడ్ అప్‌డెట్ సిద్ధం చేస్తున్న అఖిల్
‘ఇండస్ట్రీ ఏదైనప్పటికి మహిళలకు ఇబ్బందులు మాత్రం తప్పవు. ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో ఓ దర్శకుడు నాతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడు. అందరి ముందు అతడిపై గట్టిగా అరిచాను. అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఎలా రియాక్ట్ కావాలి అ క్షణమే తెలుసుకున్నా. ఇక ప్రస్తుతం నా కెరీర్ ఇప్పుడు నేను కోరుకున్నట్లుగానే ఉంది. ప్రేక్షకులు కూడా నన్నెంతగానో ప్రేమిస్తున్నారు. వారి ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. కానీ కొంతమంది నన్ను నటి అలియా భట్ తో పోలుస్తూ తమ ప్రేమను తెలియజేస్తున్నారు. మనకు ఇండస్ట్రీలో ఇప్పటికే ఒక అలియా ఉన్నారు, మరొకరు అవసరం లేదు అని నా అభిప్రాయం. ఆమెలా ఉండాలని వేరొకరు అనుకోరు. ఎందుకంటే, అలియా ఓ అద్భుతమైన హిరోయిన్ సినిమాల్లోనే కాదు. నిజ జీవితంలోనూ ఆమె ఎంతో ఉన్నతంగా ఉంటారు. నేను కూడా ఆమె నుంచి ఎంతో స్ఫూర్తి పొందుతుంటా. ఎన్నో విషయాలు నేర్చుకోవాలనుకుంటా. అందుకే ఆమెతో పోల్చి చూస్తుంటే మాత్రం పెద్దగా నచ్చదు. నన్ను నాలా గుర్తిస్తే చాలు. నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనేది నా ఉద్దేశం’ అని షాలినీ పాండే చెప్పుకొచ్చింది.