అక్కినేని అఖిల్.. హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న మంచి హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికి అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయాయి. చివరగా ‘ఏజెంట్’ మూవీ వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్డేట్ ఇవ్వలేదు అఖిల్. దీంతో అక్కినేని అఖిల్ కొత్త సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే అఫీషియల్‌గా అఖిల్ కొత్త ప్రజెక్ట్ #Akhil 6 అనౌన్స్ చేయకుండానే సైలెంట్‌గా పూజా కార్యక్రమాలు నిర్వహించి సెట్స్ మీదకు తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో దీని గురించి రోజుకో వార్త వినిపిస్తోంది. అయినప్పటికి మేకర్స్ సైడ్ నుంచి ఏ కన్ఫర్మేషన్ రాలేదు. అయితే లేటెస్ట్ గా #Akhil 6 సినిమా గురించి మరో వార్త వినిపిస్తోంది.
‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కృష్ణ అబ్బూరి డైరెక్షన్‌లో అఖిల్ కెరీర్‌లోని 6వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాను అత్యంత ప్రెస్టీజియస్‌గా, రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించనున్నట్లు సమాచారం. అఖిల్ కి జంటగా ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవగా.. దీనికి ‘లెనిన్’ అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.