Taraka Ratna Tatoo: హీరో తారకరత్న 23 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ శనివారం సాయంత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మహాశివరాత్రి రోజే ఆయన శివైక్యం చెందారు. తారకరత్న మరణవార్త విని టాలీవుడ్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. హీరోగానే కాదు విలన్ గా నటించి తన నటనతో వైవిద్యం చూపించిన ఆయన తాజాగా లోకేస్ యువగళం పేరిట ప్రారంభించిన పాదయాత్రలో గుండెపోటుకు కుప్పకూలి పడిపోయారు. దీంతో వెంటనే ఆయన్ని మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ఈనేపథ్యంలోనే బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకరత్న చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం కన్నుమూశారు. అయితే తారకరత్న చేతిపై ఉన్న టాటాకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. తారకరత్న తన ఎడమ చేతిపై సింహపు బొమ్మను టాటూగా వేయించుకున్నాడు. దాని వెనుక ఒక చరిత్రే ఉంది. ఆ టాటూను ఒకరిపై ప్రేమతో తారకరత్న తన చేతిపై వేయించుకున్నాడట.
Read also: Astrology: ఫిబ్రవరి 19, ఆదివారం దినఫలాలు
అంతేకాదు ఆ టాటూ కింద ఒకరి ఆటోగ్రాప్ కూడా వుంది. ఆ ఆటోగ్రాఫే కాదు ఆ మనిషి అంటే అభిమానమే కాదు ప్రాణం కన్నా ఎక్కువ. తన జీవితంలో చరగని ముద్రగా ఆ టాటూకింద వున్న ఆటోగ్రాఫ్ కూడా వేయించుకోవడం హాట్ టాపిగా మారింది. అయితే టాలూ అయితే సింహపు బొమ్మ .. దాని కింద వున్న ఆటోగ్రాప్ ప్రాణం కంటే ఎక్కువగా అభిమానించే బాబాయ్ బాలయ్య ఆటోగ్రాఫ్ ను టాటూగా వేయించుకున్నాడు. బాలయ్య అంటే సింహం లాంటి మనిషి వెలకట్టలేని ప్రేమకు నిదర్శనంగా ఆ సింహం. ఆయన చేతితో ఆటోగ్రాఫ్ ఎప్పటికి తనతో వుండాలనే ఉద్దేశంతో తారకరత్న తన చేతిపై వేయించుకున్నాడు తారకరత్న. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఈ టాటూను బాబాయ్ బాలకృష్ణపై ఉన్న ప్రేమకు నిదర్శనంగా తారకరత్న టాటూను వేయించుకున్నాడు.
Read also: Balakrishna: బాల బాబాయ్ అని పిలిచేవాడు.. తారకరత్న మృతిపై బాలయ్య ఎమోషనల్ పోస్ట్
అందుకే అబ్బాయ్ – బాబాయ్ ల మధ్యలో ఉన్న అనుబంధం కారణంగానే తారకరత్న ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఎంతగానో తల్లడిల్లారు బాలయ్య. తారకరత్న గుండెపోటుకు గురయ్యారనే వార్తతో అక్కడకు స్వయంగా వెళ్లి తారకరత్నను కన్న బిడ్డలా చూసుకున్నారు. తారకరత్న ఇంత ప్రేమ చూపించారు కాబట్టే తన బాబాయ్ కి గుర్తుగా సింహం టాటూను తన చేతిపై వేయించుకున్నారు. అయితే.. వీరిద్దరి అనుబంధం అబ్బాయ్-బాబాయ్ ల అనుబంధంలా కాకుండా ఓ తండ్రి కొడుకులకు ఉన్న అనుబంధంలా ఉంటుందని చూసిన వాళ్లందరు చెబుతున్నారు. ఇప్పడు ఆటాటూను చూసిన బాలయ్య కంట కన్నీరు ఆగలేదు. బాలయ్యను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఇక..తారకరత్న మృతిపై సినీ ప్రముఖులతో పాటుగా రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం ప్రకటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, నారా చంద్రబాబు నాయుడు, కిషన్ రెడ్డి తదితరులు తారకరత్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Bapatla Accident: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి