Balakrishna: బాల బాబాయ్ అని పిలిచేవాడు.. తారకరత్న మృతిపై బాలయ్య ఎమోషనల్ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna Emotional Post On Tarakaratna Demise: నందమూరి తారకరత్న మృతి అటు సినీ పరిశ్రమ, ఇటు నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. మృత్యువుతో పోరాడి ఆరోగ్యంగా తిరిగి వస్తాడనుకున్న తారకరత్న.. తిరిగిరాని లోకాలకువెళ్లిపోవడంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ తాజాగా ఫేస్‌బుక్‌లో తారకరత్న మృతిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తనని బాల బాబాయ్ అని పిలిచేవాడని.. ఇకపై ఆ పిలుపు వినబడదంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తారకరత్న మృతి నందమూరి అభిమానులకు, టీడీపీ కుటుంబ సభ్యులకు తీరని లోటు అని పేర్కొన్నారు.
Taraka Ratna: ‘మోకిల’కి తారకరత్న భౌతికకాయం…
Also Read
‘‘బాల బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచే మా తారకరత్న పిలుపు, ఇక వినబడదని ఊహించుకోవడాన్నే తట్టుకోలేకపోతున్నా. నందమూరి అభిమానులకు, టీడీపీ కుటుంబసభ్యులకు తారకరత్న మరణం తీరని లోటు. నటనలోనూ తనకు తాను నిరూపించుకున్నాడు. కఠోరంగా మృత్యువుతో పోరాడుతున్నప్పుడు.. మృత్యుంజయుడై తిరిగి వస్తాడనుకున్న తారకరత్న, ఇక కానరాని లోకాలకు వెళ్ళాడు. తారతరత్న ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలి’’ అంటూ బాలయ్య కన్నీరుమున్నీరు అయ్యారు. కాగా.. తారకరత్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు.. బాలయ్య పలుసార్లు ఆసుపత్రికి హాజరయ్యారు. అతని ఆరోగ్యం గురించి అప్డేట్ ఇస్తూ వచ్చిన ఆయన.. తిరిగి కోలుకోవాలని ప్రార్థించారు.
Bapatla Accident: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
ఇదిలావుండగా.. నారాలోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న, జనవరి 26న కుప్పంలో హార్ట్‌అటాక్‌తో కుప్పకూలారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న.. నిన్న చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. ఈయన మృతి టాలీవుడ్‌ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తారకరత్న మృతిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సినీ తారలు, రాజకీయ నాయులతో పాటు ప్రముఖులు తారకరత్న మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.
Nandamuri Tarakaratna: తారకరత్న మృతి.. సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం
తాజావార్తలు
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!