మరో సినిమాలో నుంచి కాజల్ అవుట్

అందాల చందమామ కాజల్ అగర్వాల్ తల్లి కాబోతోంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అందులో నిజం ఎంతుందో తెలియదు కానీ కాజల్ వాటిపై స్పందించలేదు. కాజల్ తల్లి కాబోతున్న కారణంగానే నాగార్జున, ప్రవీణ్ సత్తారు న్యూ ప్రాజెక్ట్ ‘ఘోస్ట్’లో నుంచి తప్పుకుందని అన్నారు. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా ఆమె మరో సినిమా నుంచి తప్పుకుందని ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ సమాచారం మేరకు ఆమె నటించాల్సిన ఓ తమిళ చిత్రంలో కాజల్ బదులు మిల్కీ బ్యూటీ హన్సిక నటిస్తోంది.

Read Also : ఎన్టీఆర్ షోకు మరో పాపులర్ గెస్ట్

జెఎం శరవణన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో సోనియా అగర్వాల్, రాయ్ లక్ష్మి, రామ్‌కి, సత్యరాజ్, జాన్ కొక్కెన్, మీనా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దీనిని రమేష్ పి పిళ్ళై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సామ్ సిఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. వైరముత్తు సాహిత్యం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. అయితే కాజల్ గర్భవతి అవ్వడంతోనే సినిమాలను పక్కన పెట్టేస్తోందని, ఇప్పటికే ఒప్పుకున్న సినిమాల నుంచి తప్పుకోవడమే కాకుండా కొత్త ప్రాజెక్టులకు సైతం సైన్ చేయడం లేదని సమాచారం.

-Advertisement-మరో సినిమాలో నుంచి కాజల్ అవుట్

Related Articles

Latest Articles