పలు అనారోగ్య కారణాలతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ఇప్పుడిప్పుడే మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోయింది. వరుస పెట్టి సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తోంది. నిర్మాతగా మారి ‘శుభం’ మూవీ తో వచ్చిన ఈ అమ్మడు మొదటి చిత్రం తో మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ అనే మూవీ చేస్తోంది. అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే ప్రాజెక్ట్‌లోనూ భాగమైంది. అయితే ఈ మధ్య సామ్ మూవీస్ పరంగా మాత్రమే కాకుండా.. ఎక్కువగా ఈవెంట్స్‌లో పాల్గొంటూ సందడి చేస్తోంది.
Also Read : Good Wife : ఏకంగా ఏడు భాషల్లో ప్రియమణి ‘గుడ్ వైఫ్’ వెబ్ సిరీస్..
ఇందులో భాగంగా తాజాగా సమంత దుబాయ్‌లో జరిగిన ఓ స్పెషల్ ఈవెంట్‌కు చాలా స్పెషల్‌గా ముస్తాబై వచ్చింది. ఎంబ్రాయిడరీ నెట్ గోల్డ్ కలర్ శారీలో మెరిసిపోయింది. సింపుల్ మేకప్, హెయి స్టైల్‌తో తన లుక్‌కు మరింత అందంగా మార్చుకని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సామ్‌ను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. వారందరితో సమంత ఫోటోలు, సెల్ఫీలకు ఫోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సామ్ తన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ ఆకట్టుకుంటున్నాయి. మొన్నటి వరకు జనాలోకి రావడానికి ఇబ్బంది పడిన సామ్ ఇలా అందరితో కలిసి పోతుంటే ఆమె అభిమానులు ‘సామ్ ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ ఉండాలి’ అంటూ కామెంట్‌లు పెడుతున్నారు.