కుందనపు బొమ్మ అంటూ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జెస్సీ అలియాస్ సమంత.. అప్పుడే 15 ఏళ్ల కెరీర్ కంప్లీట్ చేసుకుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఒడిదుడుకులు చూసిన సామ్..మళ్లీ మునుపటి ఫామ్ కోసం గట్టిగా ట్రై చేస్తుంది. విజయ్ దేవరకొండ తో చేసిన ‘ఖుషీ’ తర్వాత వెండితెరపై కనిపించలేదు. తెలుగు ఆడియన్స్‌ను పలకరించలేదు. రీసెంట్లీ టాలీవుడ్‌లోకి తిరిగి వచ్చేయాలంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేయడంతో వచ్చేస్తున్నా అంటూ కన్ఫర్మ్ చేసింది. ఈ ఎనౌన్స్ మెంట్ సమంత అభిమానుల్లో బూస్టర్ నింపినట్లయ్యింది.
Also Read: Sunny Deol: ‘జాత్’ మూవీ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్
తిరిగి వచ్చేస్తున్నా బ్రో అంటూ సమంత చేసిన ఒక్కే ఒక్క కామెంట్‌తో టాలీవుడ్ సినీ సర్కిల్క్ లో పెద్ద చర్చే నడుస్తుంది. రీసెంట్లీ నందిని రెడ్డి బర్త్ డే సందర్భంగా లేడీ డైరెక్టర్‌ను సామ్ విష్ చేయడంతో.. ఏముంది వీరిద్దరు కలిసి సినిమా చేయబోతున్నారంటూ రూమర్లు వచ్చాయి. దీంతో నందిని క్లారిటీ ఇచ్చింది. జస్ట్ రూమర్.. ఈ సారి మంచి గాసిప్స్ సృష్టించండి అంటూ కౌంటర్ వేసింది బేబీ డైరెక్టర్ నందు. దీంతో పాటుగా నెక్ట్స్ రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో రాబోయే సినిమాలో సామ్ నటించబోతుందంటూ ఓ బజ్ సినీ సర్కిల్క్‌లో చక్కర్లు కొడుతుంది.
దీని గురించి కూడా ఎలాంటి క్లారిటీ లేదు. ఇక గత ఏడాది సొంత నిర్మాణ సంస్థను స్థాపించిన సమంత.. ‘మా ఇంటి బంగారం’ అనే మూవీని ప్రకటించింది. కానీ ఈ సినిమా ఎంతవరకు వచ్చిందో ఇప్పటివరకు ఒక అప్డేట్ ఇవ్వలేదు. అసలు ప్రాజెక్ట్ ఉందో లేదోనన్న డౌట్ కూడా ఫ్యాన్స్ లో మొదలైంది. ఇప్పుడు వచ్చేస్తున్నా బ్రో అంటూ టాలీవుడ్ రీ ఎంట్రీ కన్ఫర్మ్ చేయడంతో.. అప్ కమింగ్ తెలుగు మూవీ ఎనౌన్స్ మెంట్ కోసం ఈగర్ లీ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి సామ్ వీటన్నిటి గురించి తీపి కబురు ఎప్పుడు చెబుతుందో చూద్దాం.