గత ఎనిమిదేళ్లలో ప్రభాస్ నుంచి గంటే నాలుగే సినిమాలు వచ్చాయి. డార్లింగ్ రేంజ్ ఎంత స్పీడుగా పెరుగుతుందో… సినిమాల నెంబర్ మాత్రం అదే స్పీడుగా తగ్గుతోంది. ఆ త్వరలో రిలీజ్ అవుతుందనుకుంటున్న ఓ మూవీ కూడా ఏడాది పాటు వాయిదా పడింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ టెన్సన్ మొదలైంది. రీసెంట్గా రాధేశ్యామ్(Radhe Shyam) సినిమాతో 280 ఆడియన్స్ ముందుకు వచ్చిన ప్రభాస్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో డార్లింగ్ నెక్స్ట్ మూవీ కోసం ఆడియన్స్ మరింత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ కూడా నాలుగు సినిమాలను లైన్లో పెట్టి గట్టిగానే హడావిడి చేశారు. కానీ ఈ హడావిడి తెర మీద చూడాలంటే మాత్రం ఇంకా చాలా రోజులు వెయిట్ చేయాల్సిందే.. అన్న టాక్ వినిపిస్తోంది. ఆదిపురుష్ (adipurush) షూటింగ్ ఆల్రెడీ ఫినిష్ అయ్యింది. సంక్రాంతి రిలీజ్ అంటూ డేట్ కూడా లాక్ చేశారు మేకర్స్. కానీ భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న మూవీ కావటంతో అనుకున్న టైముకు రిలీజ్ అవుతుందా లేదా అన్న అనుమానాలు ఆడియన్సు వెంటాడుతున్నాయి.
సలార్ షూటింగ్ కూడా ఫుల్ స్వింగ్ జరుగుతోంది. ఆల్రెడీ మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయ్యింది. దీంతో ఆదిపురుష్ రిలీజ్ అయినా.. కాకపోయినా.. నెక్స్ట్ ఇయర్ సలార్ రిలీజ్ పక్కా అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించటం లేదు. సలార్ రిలీజ్ ను వాయిదా వేశారన్న న్యూస్ ఫిలిం సర్కిల్ లో హల్ చల్ చేస్తోంది. షూటింగ్ షెడ్యూల్స్ ఆలస్యం అవుతుండటం.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంత వరకు షురూ కాకపోవటంతో సమ్మర్కు సలార్ రిలీజ్ కష్టమే అన్నది ఇండస్ట్రీ టాక్. అంతేకాదు ఈ సినిమాను ఏకంగా నెక్స్ట్ ఇయర్ దసరాకు రిలీజ్ చేసే ఆలోచనలో ఉందట. మూవీ ఆరింగ్ సినిమా ప్రధాన టీమ్ ఈ న్యూస్ వైరల్ కావటంతో డార్లింగ్ సినిమా అంటే డిలే తప్పదని ఫిక్స్ అవుతున్నారు డై హార్డ్ ఫ్యాన్స్.
సలార్ కు సబంధించిన మూవీ అప్డేట్ను ఆగస్టు 15 మధ్యాహ్నం 12.58 నిమిషాలకు ప్రకటించిన్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అయితే ‘సలార్’ విడుదల తేదీ ప్రకటిస్తారా? అన్న వార్తలు వస్తున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తున్నారు. హోంబలే సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రెండు పాత్రల్లో నటించనున్నట్లు టాక్. అయితే.. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘తన్హాజీ’ ఫేమ్ ఓం రౌత్ తెరకెక్కించారు. ఈనేపథ్యంలో.. దీనితో పాటు నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ ‘ప్రాజెక్ట్- కె’ సినిమా చేస్తున్నారు. డార్లింగ్ తన 25వ సినిమాను సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయబోతున్నారు.
Nitish Kumar: బిహార్ యువతకు వజ్రోత్సవ కానుక.. 10లక్షలు ఉద్యోగాలిస్తామని సీఎం హామీ