లేడి పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నేచురల్ బ్యూటి సాయి పల్లవి ప్రజంట్ వరుస హిట్ లతో ధూసుకుపోతుంది. ఇక ఈ అమ్మడు సినిమాల ఎంపిక విషయంలో ఎంత క్లారిటిగా ఉంటుందో మనకు తెలిసిందే. ఆమె ఒక సినిమా ఒప్పుకుంటే కచ్చితంగా ఆ మూవీలో ఎదో బలమైన కథ ఉందని అందరూ నమ్ముతారు. అందుకే సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే ఈ సినిమా సగం సూపర్ హిట్ అయిపోయినట్టే. ఇలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ రప్పించగల సత్తా ఉన్న ఈ హీరోయిన్ తాజాగా ఒక సినిమా నుండి తప్పుకుందట.
Also Read : Nani : ‘ది ప్యారడైజ్’ మూవీకి ఊహించని బ్రేక్..?
‘బలగం’ చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటాడు వేణు యెల్దండి. పక్కా ఎమోషనల్ కథగా ఈ సినిమా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రం ‘ఎల్లమ్మ’ తెరకెక్కించేందుకు ఈ డైరెక్టర్ సిద్ధమవుతున్నాడు.ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించబోతున్నట్లు కన్ఫర్మ్ కాగా. ఈ మూవీలో హీరోయిన్‌గా అందాల భామ సాయి పల్లవి నటించబోతున్నట్లు, కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారినట్లు తెలుస్తోంది. ఎంటంటే ‘ఎల్లమ్మ’ మూవీ షూటింగ్‌ను ఈ ఏడాది చివరినాటికి ప్రారంభించాలని మేకర్స్ భావిస్తుంటే.. చివరి నిమిషంలో సాయి పల్లవి డెట్స్ కుదరడం లేదు అని ఈ సినిమాకు నో చెప్పినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. దీంతో మేకర్స్ సాయి పల్లవి ప్లేస్‌లో వేరొక హీరోయిన్ కోసం వెతుకుతున్నారట.