NTV Telugu Site icon

Lavanya: లావణ్య బండారం బట్టబయలు చేసిన రాజ్ తరుణ్ ఫ్రెండ్… అతను రేప్ చేస్తే?

Raj Tarun Lavanya

Raj Tarun Lavanya

RJ Sekhar Basha Reveals Lavanya and Mastan Rao Case: సినీ హీరో రాజ్ తరుణ్, లావణ్య అనే అమ్మాయితో సహజీవనం అనే అంశం తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. తనను పెళ్లి కూడా చేసుకుని ఇప్పుడు మాల్వితో తిరుగుతూ తనను వదిలేశాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అసలు లావణ్య క్యారెక్టర్ మంచిదికాదని ఆమె అబద్దాల కోరని, ఆమె డ్రగ్స్ ను అమ్మేదనని.. ఈ విషయంలో కేసు కూడా బుక్ అయిందని రాజ్ తరుణ్ స్నేహితుడుగా చెప్పుకుంటూ శేఖర్ బాషా అనే ఆర్జే పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. మస్తాన్ రావ్ అనే వ్యక్తి నునుచి లావణ్య మత్తు పదార్థాలను కొని బయట ఎక్కువ రేటుకు అమ్మేదని, ఆ పరిచయంతో ఇద్దరూ ఒకటయ్యారని కూడా శేఖర్ చెబుతున్నారు.

Deadpool & Wolverine: కుర్చీ మడతెట్టడమే అంటున్న ‘డెడ్ పుల్ అండ్ వాల్వ‌రిన్’ ట్రైలర్‌

మస్తాన్ రావు, లావణ్య తరచూ కలుస్తుండేవారు. మస్తాన్ రావ్ కి వేరే అమ్మాయిలతో ఎఫైర్స్ వున్నాయని లావణ్యకు తెలిసి లావణ్య నిలదీస్తే ఇద్దరూ కలిసిన పర్సనల్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడని ఇప్పుడు లావణ్య కూడా రాజ్ తరుణ్ ను అదే రూటులో బ్లాక్ మెయిల్ చేస్తుందని ఆరోపించారు. గత ఏడాది గుంటూరులోని పట్టాభిపురంలో లావణ్య మస్తాన్ రావు మీద ఎఫ్.ఐ.ఆర్. బుక్ చేయించిందని కూడా బయట పెట్టాడు. మస్తాన్ చెల్లె పెళ్ళికి అని గుంటూరు పిలిపించి తన మీద దాడి చేశాడని, రేప్ కూడా చేశాడని ఆమె కంప్లైంట్ లో పేర్కొంది. అదే విషయాన్ని చెబుతూ ఆ ఎఫ్ఐఆర్ కాపీని కూడా శేఖర్ బయటపెట్టాడు.

Show comments