Tollywood : తెలుగు ఇండస్ట్రీ సెంటిమెంట్ ఫీలవుతుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు ఔట్ డోర్ షూటింగ్స్ అనగానే ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని ప్రాంతాలు లేదా వైజాగ్, ఊటీ పర్యాటక ప్రాంతాల్లో వాలిపోయేది సౌత్ సినీ ఇండస్ట్రీ. ఇప్పుడు పొలాచ్చి పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. కానీ రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ చూపు ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల వైపు చూస్తోంది. కోరాపూట్ జిల్లాల్లోని పలు లొకేషన్లలో షూటింగ్స్ జరుపుకుంటున్నాయి తెలుగు సినిమాలు. పుష్ప2లోని కొన్ని కీ సీన్స్ మచ్ కుండ్, లామ్తాపుట్, డుడుమాలో చిత్రీకరించాడు సుకుమార్. కోరాపూట్ జిల్లాలో ఎత్తైన కొండలు, పచ్చిక బయళ్లు, జలపాతాలు, లోయలు, విశాలవంతమ అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో రీసెంట్ టైమ్స్ లో ఇండియన్ స్విట్జర్లాండ్ అనే పేరొచ్చింది.
Also Read : Kiara Advani : బాలీవుడ్ బడా ప్రాజెక్ట్ నుండి వైదొలిగిన కియారా..?
Also Read
దీంతో టాలీవుడ్ చిత్రాలకు కొత్త లోకేషన్ దొరికినట్లయ్యింది. రీసెంట్ ఇండస్ట్రీ హిట్ సంక్రాంతికి వస్తున్నాంలోని కొన్ని సీన్లను కూడా ఒడిశాలోని బల్దా కేవ్ లో చిత్రీకరించాడు అనిల్ రావిపూడి. అలాగే వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్న అనుష్క మూవీ ఘాటీ కూడా ఇక్కడ అడవుల్లోనే షూటింగ్ జరుపుకుంది. డియోమోలి, జేపోర్, కోలాబ్, మచ్ కుండ్లలో షూటింగ్ చేశారని తెలుస్తోంది. ఇప్పుడు యావత్ ప్రపంచం ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఎస్ఎస్ఎంబీ షూటింగ్ కూడా ఈ అడవులకు షిఫ్ట్ అయ్యింది. డియోమోలి, డుడుమ, ఒనకడిల్లి, తోలోమాలీ ప్రాంతాల్లో షూటింగ్స్ చేస్తున్నారు. రీసెంట్లీ అక్కడకు షిఫ్ట్ కాగా, లీక్ వీరులు కొన్ని వీడియోలను షేర్ చేశారు నెటిజన్లు. పృధ్వీ సుకుమారన్, మహేష్ చిత్రీకరించిన సీన్స్ లీకయ్యి చిత్ర యూనిట్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది.ప్రజెంట్ చాలా ప్రికాషన్స్ తీసుకుని షూట్ చేస్తున్నారని సమాచారం. వెయ్యి కోట్లతో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోందని టాక్ నడుస్తోంది. మరీ ఇక్కడే షూటింగ్ జరుపుకున్న పుష్ప2, సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ హిట్టుగా మారాయి. చూడబోతే ఇదొక సెంటిమెంటల్ షూటింగ్ ఏరియాగా మారిపోయేట్లే కనిపిస్తోంది. మరీ ఘాటీ, ఎస్ఎస్ఎంబీ29 కూడా అంతే హిట్ రీసౌండ్స్ తెచ్చుకుంటాయోమో చూడాలి.
తాజావార్తలు
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
-
OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
-
Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
-
Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!