స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబోలో వచ్చిన సెన్సేషన్ హిట్ పుష్ప. దానికి కొనసాగింపుగా వస్తున్నా ‘పుష్ప-2’ కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ, కాకినాడ లో మూడు యూనిట్లు షూటింగ్ చక చక చేస్తున్నాయి. ఓ సాంగ్, కొంత మేర క్లైమాక్స్ షూట్ మినహా మిగతా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హల చల్ చేస్తోంది. సుకుమార్ సినిమాలో ఓ ఐటెం సాంగ్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. దాదాపు అన్ని సినిమాల్లో ఐటం సాంగ్ ఉండలా చూస్తాడు సుకుమార్. పుష్ప లోని ఊ అంటావా మావా సాంగ్ ఎంత హిట్ అయిందో చూసాం. ఇప్పుడు రాబోతున్న పుష్ప – 2 లోను మాంచి ఐటం సాంగ్ ను ప్లాన్ చేసాడట సుక్కు. అయితే ఈ సాంగ్ కోసం స్టార్ బ్యూటీని తీసుకోవాలని చూస్తుంది యూనిట్. ఇప్పటికే ఈ పాటలో నటించే భామ ఇదే అంటూ చాలా మంది పేర్లు వినిపించాయి. రీసెంట్ గా జాన్వీ కపూర్ పేరు కూడా గట్టిగా వినిపించింది. కానీ అవేవీ వాస్తవం కాదని కొట్టి పారేసింది యూనిట్. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ని ఈ ఐటెం సాంగ్ కోసం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం శ్రద్ధా ఏకంగా రూ.4 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్టు టాక్ నడుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.