Ranveer Singh meets Akon: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) అంటే తెలియని వాళ్లు ఉండరు. తన అల్ట్రా స్టైలిష్ డ్రెస్సింగ్ తో, పది రెడ్ బుల్స్ తాగినంత ఎనర్జీగా ఉండే రణ్‌వీర్ సింగ్ కి హిందీలోనే కాదు సౌత్ కూడా మంచి గుర్తింపే ఉంది. టెర్రిఫిక్ పెర్ఫార్మార్ గా, స్టైల్ ఐకాన్ గా పేరు తెచ్చుకున్న రణ్‌వీర్ సింగ్ ను “నువ్వు ఎవరో మర్చిపోయాను” అంటూ ఒక రిపోర్టర్ అడిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని’ సినిమా వర్క్స్ కంప్లీట్ చేసిన రణ్‌వీర్ ప్రస్తుతం అబు దాబిలో ఉన్నాడు. అక్కడ జరిగే ఎఫ్ 1 రేస్‌లను చూసేందుకు వెళ్లిన రణ్‌వీర్ సింగ్ ఎల్లో డ్రెస్ లో ఎప్పటిలానే డిఫరెంట్ గా కనిపించాడు.
Read also: Viral News: సీసాలో బయట పడ్డ 135ఏళ్ల నాటి లేఖ .. అందులో ఉన్నది చదవగానే..
ఎఫ్ 1 రేస్ లో ఉండే వైబ్ ని ఎంజాయ్ చేస్తున్న రణ్‌వీర్ సింగ్ ను జర్నలిస్ట్ మార్టిన్ బ్రూండెల్ (Martin Brundle) “I’ve momentarily forgotten who you are, remind me again?”(నువ్వు ఎవరో మర్చిపోయాను, గుర్తు చేయగలవా?) అని అడిగాడు. స్టార్ హీరోలు జనరల్ గా ఇలాంటి ప్రశ్నలు వింటే ఆడ్ గా రియాక్ట్ అవుతారు కానీ రణ్‌వీర్ సింగ్ మాత్రం చాలా స్పోర్టివ్ గా తీసుకొని, ‘నేను బాలీవుడ్ నటుడిని సర్. నేను ముంబై, ఇండియా నుంచి వచ్చాను. నేను ఓ ఎంటర్‌టైనర్‌ని’ అని చెప్పుకొచ్చాడు. అలాగే.. తన బట్టలపై తానే జోక్ వేసుకుంటూ ‘రేపు ఉదయమే ఈ బట్టలను వెనక్కి ఇచ్చేయాలి’ అని సరదాగా కామెంట్ చేశాడు. రణ్‌వీర్ సింగ్ కూల్ గా రియాక్ట్ అయిన విధానం చూసిన వాళ్లు అతని యాటిట్యూడ్ కి ఇంప్రెస్ అవుతున్నారు. ఎఫ్ 1 రేస్ ఎంజాయ్ చేసిన రణ్‌వీర్ ఆ తర్వాత అమెరికన్ సింగర్ అకొన్(Akon) తో కలిసి కాసేపు సరదాగా టైం స్పెండ్ చేశాడు. ఈ ఇద్దరూ కలిసి షారుక్ నటించిన రా.వన్ సినిమాలోని చమ్మక్ చల్లో సాంగ్ ని హమ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది(Ranveer Singh meets Akon).
Today in F1 crossovers :
Martin Brundle, who has no idea who Ranveer Singh is, sliding in with a “I’ve momentarily forgotten who you are, remind me again?” 😂😂#F1 just keeps giving. But, Ranveer being a sport answered graciously.
Thank god. #AbuDhabiGP #Formula1 pic.twitter.com/7QGBIv45pt
— piyush mahamuni (@piyush_mahamuni) November 20, 2022