Viral News: సీసాలో బయట పడ్డ 135ఏళ్ల నాటి లేఖ .. అందులో ఉన్నది చదవగానే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral News: స్కాట్లాండ్‌లోని ఓ ఇంట్లో మరమ్మతుల కోసం తవ్వకాలు జరుపుతుండగా 140ఏళ్ల కిందటి లేఖ బయటపడింది. మందు బాటిల్లో భద్రపరిచిన ఈ లేఖ విక్టోరియన్ కాలం నాటిదని పలువురు భావిస్తున్నారు. సీసాలోని లేఖను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కానీ, సాధ్యం కాకపోవటంతో ఇంటి యాజమానులు దానిని పగలగొట్టారు. అనంతరం అందులోని లేఖను తీసి చదివే ప్రయత్నం చేశారు. ఆ లేఖపై 1887 సంవత్సరం తేదీ వేసి ఉంది. కాగా అందులో ఇద్దరు వ్యక్తుల సంతకాలు చేసి ఉన్నాయి. పీటర్ అలన్ అనే 50ఏళ్ల వృద్ధుడు ఎడిన్‌బర్గ్ ప్రాంతంలోని ఓ ఇంటిలో ప్లంబర్ పనిచేస్తున్నాడు. పైపులైన్ గుర్తించేందుకు తవ్వకాలు నిర్వహించాడు. ఈ క్రమంలో తొవ్వుతుండగా .. విస్కీ బాటిల్ కనిపించింది. దానిలో విక్టోరియన్ కాలంనాటి లేఖ ఉన్నట్లు గుర్తించాడు. ఈ విషయాన్ని వెంటనే ఇంటి యాజమానికి సమాచారం అందించారు.
Read Also: Donald Trump : ‘ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్’.. ట్విటర్ పై ట్రంప్ అసహనం
Also Read
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
- Noel Tata vs Chandrasekaran: టాటా సన్స్‌లో బోర్డు వార్.. చంద్రశేఖరన్ పునర్నియామకంపై నోయెల్ టాటా అభ్యంతరం
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
- Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..

ఆ ఇంటి యాజమాని ఎలిద్ స్టింప్సన్. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమె ఆ బాటిల్ ను తెరిచేందుకు ప్రయత్నించింది. కానీ పది, ఎనిమిదేళ్ల వయస్సు కలిగిన పిల్లలు వచ్చేవరకు ఆగి ఆ తరువాత ఆ సీసాను పగులగొట్టింది. అనంతరం ఆ లేఖను సీసా నుంచి బయటకు తీసి చదివింది.1887 అక్టోబర్ 6 కాలంనాటి ఉత్తరంగా గుర్తించారు. అందులో ఇద్దరు మగ వ్యక్తులు జేమ్స్ రిట్చీ, జాన్ గ్రీన్ అనే వ్యక్తులు ఈ లెటర్ పై సంతకం చేసినట్లు ఉంది. నోట్‌ను చదవగా ఇలా వ్రాసి ఉంది.. “జేమ్స్ రిట్చీ అండ్ జాన్ గ్రీవ్ ఈ అంతస్తును వేశారు, కానీ వారు విస్కీని తాగలేదు. “ఎవరైనా ఈ బాటిల్‌ను కనుగొంటే మన దుమ్ము రోడ్డుపై ఎగిరిపోతోందని అనుకోవచ్చు.” అని ఉంది. ఆ తరువాత ఎలిద్ బాటిల్, నోట్ చిత్రాన్ని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. దీంతో 135సంవత్సరాల నాటి లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
-
Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
-
Noel Tata vs Chandrasekaran: టాటా సన్స్‌లో బోర్డు వార్.. చంద్రశేఖరన్ పునర్నియామకంపై నోయెల్ టాటా అభ్యంతరం
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!