టాలీవుడ్ విలక్షణ నటుడు రానా దగ్గుపాటి. కథ ఏదైనా సరే తనదైన శైలీలో పాత్రకు ప్రాణం పోస్తాడు. బాహుబలిలో పవర్ ఫుల్ యాక్టింగ్ తో మెప్పించాడు. కానీ సోలో హీరోగా సినిమా చేసి చాలా కాలం అయింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ తేజాతో ‘రాక్షసరాజా’ అనే సినిమాను ప్రకటించాడు రానా. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో మోహన్ లాల్ నటిస్తాడంటూ వార్తలు కూడా వచ్చాయి. రానా సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. తేజ దర్శకత్వంలో రానా ‘రాక్షసరాజా’తో భారీ హిట్ కొడతాడు అనుకుంటే ఈ సినిమా అకారణంగా ఆగిపోయినట్టు తెలుస్తోంది. దీంతో రానా అభిమానులు కాస్త నిరుత్సహం చెందారు. కాగా గతంలో ‘రాక్షస రాజా’ నుంచి పోస్టర్ ని విడుదల చేయగా సినిమాపై భారీ హైప్ ను పెంచింది.
Also Read: Tollywood : నువ్వా నేనా.. రెండు సినిమాలు పోటాపోటీ.. గెలిచేదెవరు.?
గతంలో రానా – డైరెక్టర్ తేజా కాంబోలో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. పొలిటికల్ నేపథ్యంలో వచ్చిన ఆ చిత్రంలో రానాను సరికొత్తగా చూపించాడు తేజ. రానా – కాజల్ మధ్య ప్రేమ, రాజకీయ పరిణామాలు అన్నీ సన్నివేశాలను ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చూపించాడు. ఇప్పుడు వారిద్దరి కాంబోలో ఆ తరహా సినిమా ఉంటుందని అభిమానులు సంతోసించేలోపే ‘రాక్షసరాజా’ సినిమా ఆగిపోయింది. ప్రస్తుతం రానా ‘రానా నాయుడు 2’ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. వెంకటేశ్ – రానా నటించిన రానా నాయుడు సిరీస్ కు పాజిటివ్ రెస్పాన్స్ రాగా.. దానికి కొనసాగింపుగా ఈ సిరీస్ రానుంది. మరి రానా దగ్గుపాటిని స్క్రీన్ పై ఎప్పుడు కనిపిస్తాడో వేచి చూడాలి.