మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్, మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకున్నాడు. ‘మగధీర’ మూవీతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు. రెండో సినిమాతోనే ఆ ఘనతను సాధించిన ఏకైక హీరోగా రామ్ చరణ్ సరికొత్త హిస్టరీని నమోదు చేశాడు. ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్లో చేస్తున్న సినిమా మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే, రామ్ చరణ్ తన కెరీర్లో చేసిన సినిమాలన్నీ అతన్ని స్టార్ హీరోగా మార్చేశాయి. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ ఇండియాతో పాటు వరల్డ్ సినిమా స్థాయిలో గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు.
ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించడంలో రామ్ చరణ్ ముందు స్థానంలో ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే, తన తోటి హీరోలైన టైర్ వన్ హీరోలందరిలో అతనికి బాగా నచ్చిన క్వాలిటీ ఏంటనే విషయాన్ని కూడా ఆయన పలు సందర్భాల్లో తెలియజేశాడు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేశారు. కాబట్టి అతనితో తనకు ఒక బ్రదర్ రిలేషన్ ఏర్పడిందని చెప్పాడు. మహేశ్ బాబు అంటే తనకు చాలా ఇష్టమని, సున్నిత స్వభావం కలిగిన ఆయన కలిసిన ప్రతిసారి ఫన్నీగా మాట్లాడుతాడని, తమ మధ్య ఎక్కువ సేపు సినిమాల గురించే డిస్కషన్ జరుగుతుందని చెబుతుంటాడు. అలాగే ప్రభాస్ ఇతర వ్యక్తుల మీద తీసుకునే శ్రద్ధ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు.
అల్లు అర్జున్‌తో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాడు. తను చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాడని, హార్డ్ వర్క్ చేస్తాడని గతంలో చరణ్ ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో ” తెలియజేయడం విశేషం. ఏదేమైనా రామ్ చరణ్ లాంటి యాక్టర్ తన తోటి నటులతో చాలా సన్నిహితంగా ఉంటాడు. కాబట్టి అతనంటే ఇతర నటులకు చాలా ఇష్టం. అలాగే ఆయనకి యాంటీ ఫ్యాన్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

