హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్రహీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకుల్ కి.. గత కొంత కాలంగా ఆశించిన స్థాయిలో సినిమాలు రావడం లేదు. అమ్మడు చివరిగా ‘ఇండియన్2’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమాలో పెద్దగా గుర్తింపు లేని పాత్ర చేసిన రకుల్ ఇప్పుడు తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టింది. ప్రజంట్ తన భర్త నిర్మాణంలో బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తోంది. దీంతో పాటుగా అజయ్ దేవగన్, మాధవన్ తో కలిసి ‘దే దే ప్రాయ్ దే2’ సినిమాలో నటిస్తోంది. ఇక కెరీర్ పరంగా రకుల్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది.. ఇంతకీ ఏంటా పోస్ట్ అంటే..
Also Read : Samantha: ఈ విషయంలో జగ్రతపడకుంటే భర్తని కోల్పోవాల్సి వస్తుంది: సమంత
‘అలవాటైన పనుల నుంచి, ప్రాంతాల నుంచి బయటకు రవాలి. కంఫర్ట్‌గా ఉన్న ప్లేసే మీకెప్పుడైనా శత్రువుగా మారుతుంది. ప్రజలు సోమరితనంగా మారడానికి కారణం కూడా ఇదే. ఎప్పుడూ ఒకే ప్లేస్ లో ఉండటం వల్ల మనిషి ఒక పని నుంచి మరో పనికి మారడం లేదు. రెగ్యులర్‌గా అలవాటైన పనినే చేస్తూపోతున్నారు. వీటన్నింటినీ అలవాటు పడి, ఏదైనా కావాలనుకున్నప్పుడు రేపు చూద్దాంలే అనుకుంటున్నారు. ఈ కారణాల చేతే చాలా మంది ఎదగడం లేదు. ఎవరైనా సరే జీవితంలో పైకి ఎదగాలంటే కఠినమైన విషయాల గురించి ఆలోచించాలని, వాటిని ఆచరణలో పెట్టాలి అప్పుడే సక్సెస్ అందుకుంటారు. అలవాటైన ప్రాంతం అందంగా ఉన్నప్పటికీ అది జీవితంలో పైకి ఎదగనీయదు’ అంటూ రకుల్ షేర్ చేసిన కోటేషన్ లో ఉంది.