బ్యూటీ క్వీన్ సమంత గురించి పరిచయం అవసరం లేదు. గత రెండు సంవత్సరాల నుంచి ఒక్క సినిమా చేయనప్పటికీ దేశంలోనే నెంబర్ వన్ హీరోయిన్‌గా చెలామణి అవుతోంది. ఇటీవల వచ్చిన సైటాడెల్ రీమేక్ వెబ్ సిరీస్ హనీ బన్నీ తో ఆకట్టుకుంది. వరుణ్ ధావన్ తో కలిసి యాక్షన్ సన్నివేశాల్లో నటించి ఓహో అనిపించింది. ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ పేరుతో ఓ సినిమా, ‘రక్త్ బ్రహ్మాండ్’ పేరుతో ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో సమంత సోషల్ మీడియాలో.. ఇంటర్వ్యూలలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అనారోగ్య సమస్యల నుండి కోలుకుంటున్న సమంత ఒంటరి జీవితాన్ని గడుపుతుంది.అయినప్పటికీ తాను మెంటలీస్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకే ప్రేమించిన మనిషి దూరం అయిన, హెల్త్ పరంగా ఎంత పెద్ద సమస్య వచ్చిన సామ్ ఎంతో ధైర్యంగా నిలబడింది. ఇదిలా ఉంటే తాజాగా జీవిత భాగస్వామి గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది సామ్.
Also Read: Rashmika: రష్మిక పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కన్నడ ఇండస్ట్రీ
సమంత మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. శారీరకంగా కానీ, మానసికంగా మనం ఆరోగ్యంగా ఉండాలి. అలా లేకపోతే మీ భాగస్వామికి నచ్చినట్లుగా మీరు కనిపించలేరు, భాగస్వామి అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఆనారోగ్యంతో ఎంత అందంగా కనిపించిన, మానసికంగా ప్రశాంతంగా ఉండరు. ఈ విషయాన్ని మీరు గుర్తించలేకపోతే మీ భాగస్వామిని మీరు కోల్పోతారు’ అని ఇంటర్వ్యూలో సమంత వెల్లడించింది. ప్రజంట్ ఈ మాటలు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.