సూపర్ స్టార్ రజినీ కాంత్ నటిస్తున్న బ్యాక్ టూ బ్యాక్ సినిమాలో ‘జైలర్ 2’ ఒకటి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో 2023 ఆగస్ట్ 10న విడుదలైన ‘జైలర్’ సినిమాకు ఇది సిక్వెల్. రజనీ వయసుకు తగినట్లుగా పాత్రను డిజైన్ చేసి ఎక్కడ అసంతృప్తి కలగకుండా కథను నడిపించారు నెల్సన్. రజనీ హీరోయిజం, మేనరిజమ్స్, యాక్షన్ సీక్వెన్స్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ‘జైలర్’ సూపర్ డూపర్ హిట్టయ్యి, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ , సునీల్, రమ్యకృష్ణ, తమన్నా, మీర్ణా మీనన్ , వినాయకన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. వారి పాత్రలను కూడా బాగా డిజైన్ చేశారు. ఇక ఈ మూవీకి సిక్వెల్‌గా ‘జైలర్ 2’ కూడా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సినిమా ప్రేమికులంతా ఎదురుచూస్తున్న ఈ చిత్రం 2026 లో వేసవి విడుదల కోసం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అనిరుద్ సంగీతం అందిస్తున్నాడగా, సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అయితే..
Also Read: Ravi Teja : ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న రవితేజ..?
తాజాగా సమాచారం ప్రకారం కేరళలోని అథపాడిలో రజనీకాంత్, ఇతరులపై మేకర్స్ ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. దాని కోసం ఇప్పటికే భారీ సెట్లను కూడా నిర్మించగా. నెల్సన్ మరో 10-20 రోజుల్లో రజిని భాగాన్ని పూర్తి చేసే ప్లాన్‌లో ఉన్నారట. కేరళ షెడ్యూల్ ముగిసిన తరువాత ఫిల్మ్ యూనిట్ చెన్నైకి రానుంది. ప్రస్తుతం అయితే నెల్స క్రేజీ కామెడీ సీన్స్ తెరకెక్కిస్తున్నారట. రజినీకాంత్ ఫ్యామిలీ సీన్స్ తన మనవడు, రమ్యకృష్ణ లపై సన్నివేశాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. మరి ఈ సినిమాలో ఫన్ ఎలా ఉంటుందో చూడాలి.