ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, తర్యాత ముఖ్యపాత్ర.. ఆ తర్వాత హీరోగా తన టాలెంట్‌తో ఒక్కో మెట్టు ఎక్కి.. ప్రజంట్ స్టార్ హీరోగా తన కంటూ స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు రవితేజా. మాస్ రాజాగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ‘ఇడియట్’ సినిమాతో మొదలు ఎక్కడ కూడా తిరిగి చూసుకోకుండా, హిట్ ఫట్‌తో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో అభిమానులను అలరిస్తునే ఉన్నాడు. ప్రజంట్ ఇక సినిమా పూర్తవ్వకముందే రవితేజ తన నెక్స్ట్ చిత్రాలు ఓకే చేస్తూ ఉన్నారు.
Also Read: Trisha : సోషల్ మీడియా పై మండిపడ్డ త్రిష..
ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రం ‘మాస్ జాతర’ తో బిజీగా ఉండగా. భాను భోగవరపు దర్శకత్వంలో, శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తుండగా, జులై 18న సినిమా రిలీజ్ కానుందని టాక్. ఇక రీసెంట్‌గా ‘తు మేరా లవర్’ అంటూ టీజ్ చేస్తున్న రవితేజ సాంగ్ ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మరిన్ని అప్ డెట్స్ రావాల్సి ఉంది. అయితే తాజాగా రవితేజ ఓ మూవీ నుంచి రవితేజ తప్పుకున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. దర్శకుడు శ్రీవాస్ రవితేజ కోసం ఓ సాలిడ్ కథను రాసుకున్నాడట. అది రవితేజకు వినిపించాడని.. ఈ ప్రాజెక్ట్‌ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. అయితే, తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి రవితేజ తప్పుకున్నట్లు తెలుస్తోంది. కారణం ఏంటీ అనే విషయం తెలియనప్పటికీ ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతోంది.