ఈ మధ్యకాలంలో హీరోయిన్‌ల మనస్తత్వం చాలా మారిపోయింది. కెరీర్ తో పాటుగా మ్యారేజ్ లైఫ్ కి కూడా విలువిస్తున్నారు. అలా ఇప్పటికి టాప్ పోజిషన్ లో ఉన్న హీరోయిన్‌లు మంచిగా పెళ్ళి చేసుకుని బిడ్డల్ని కంటూ తల్లిప్రేమను అస్వాదిస్తున్నారు. ఇందులో రాధికా ఆప్టే ఒకరు. హిందీలోనే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేసి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. కానీ రాధిక ఆప్టే సినిమాలో కంటే వివాదాస్పద అంశాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు మరోసారి వివాదంలో చిక్కుకుంది రాధిక..
Also Read:AjithKumar: పాతికేళ్ల తర్వాత తిరిగి తెరపై కనిపించబోతున్న బ్యూటిఫుల్ జంట..
2024 డిసెంబర్‌లో రాధిక ఆప్టే పండండి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో గత కొన్ని రోజులుగా పెద్దగా బయట కనిపించని రాధిక , ఇటీవల బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్ వేడుకలో సందడి చేసింది. ఆ అవార్డ్ వేడుకలో పాల్గొన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే అనూహ్యంగా బ్రెస్ట్ మిల్క్ పంపింగ్ చేస్తూ ఓ ఫోటోకు ఫోజ్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది రాధిక. తన మాత్రుత్వలోకి ఆనందాని నలుగురితో పంచుకోండంలో తప్పు కాదు కానీ..
మరో చేతిలో షాంపెయిన్ గ్లాస్ పట్టుకోవడంపైనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.. ‘ మీరు ఈ ఫోటో ద్వారా తప్పుడు సందేశం ఇస్తున్నారు. ఒక బిడ్డకు పాలు ఇస్తూ మరో పక్క మందు గ్లాస్ పట్టుకున్నారు.పాలలో ఆల్కహాల్ వ్యక్తమయ్యే అవకాశం చాలా ఎక్కువ. మీ బిడ్డకు బదిలీ అవుతుంది. ఇది శిశువుకు చాలా అనారోగ్యకరమైనది’ అంటూ కామెంట్‌లు చూస్తున్నారు. ప్రజంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.