పుష్ప 2 సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసింద. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లు తెరక్కేకిన ఈ చిత్రం గతంలో విడుదల కావాల్సి ఉంది. పలు కారణాలతో వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ ఐదవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకరోజు ముందుగానే రాత్రి 9:30 సమయంలో ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఒక ప్రీమియర్ ప్రదర్శిస్తున్న సమయంలో అక్కడికి అల్లు అర్జున్ వెళ్లడంతో తొక్కిసలాట కారణంగా ఒక మహిళ మృతి చెందింది. ఆ తర్వాత ఆ మహిళ కుటుంబ బాధ్యతలు తాను తీసుకుంటామని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది కూడా. అయితే ఈరోజు పుష్ప టీం అంతా మీడియా ముందుకు రావాల్సి ఉంది. ఉదయం 10 గంటలకు ముందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దాన్ని మధ్యాహ్నం మూడు గంటలకు పోస్ట్ పోన్ చేశారు.
Pooja Hegde : టాలీవుడ్ పై ఫోకస్ పెంచిన పొడుగు కాళ్ళ సుందరి
అయితే కొన్ని అనివార్య కారణాలతో మధ్యాహ్నం మూడు గంటలకు జరగాల్సిన ప్రెస్ మీట్ కూడా క్యాన్సిల్ అయినట్లు మీడియాకు సమాచారం అందింది. వాస్తవానికి సినిమా చిన్నదైనా పెద్దదైనా వెంటనే సక్సెస్ మీట్ నిర్వహించడం ఈ మధ్యకాలంలో ఒక ఆనవాయితీగా మారిపోయింది. అయితే ఆర్ఆర్ఆర్, బాహుబలి రికార్డులు సైతం బద్దలు కొడుతుందనే అంచనాలతో రంగంలోకి దిగిన పుష్ప 2 సక్సెస్ మీట్ నిర్వహించడం కోసమే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశారు. ఈ సినిమా దెబ్బకు ఇక మీద భవిష్యత్తులో బెనిఫిట్ షోస్ కి పర్మిషన్లు ఇవ్వము అంటూ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఖచ్చితంగా మీడియా నుంచి ఈ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సుకుమార్ టీం ఎలాంటి సమాధానం చెబుతుందో అని అందరు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న క్రమంలో ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేశారు. ఈ ప్రెస్ మీట్ కి అల్లు అర్జున్ సైతం హాజరవుతారని లీక్స్ మీడియాకి అందాయి. అయితే ఇప్పుడు ఏకంగా ప్రెస్ మీట్ క్యాన్సిల్ కావడం హాట్ టాపిక్ అవుతుంది.