చాలా కాలంగా సరైన హిట్టు చూడలేదు పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే. గజిని మహ్మద్‌లా బాలీవుడ్ పై దండయాత్ర చేస్తున్నప్పటికీ బ్లాక్ బస్టర్ సౌండ్ ఆమె చెవికి వినపడట్లేదు. అంతలో ఇటు తెలుగులో కూడా ఛాన్స్ చేజారింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో వచ్చిన గుంటూరు కారంలో ఫస్ట్ చాయిస్ పూజానే. కానీ కొంత షూటింగ్ అయ్యాక.. సడెన్‌గా తప్పుకోవడంతో ఆ పప్లేస్ లో శ్రీలీల వచ్చి చేరింది. అప్పటి నుండి తెలుగు ఇండస్ట్రీపై అలక పూనింది అమ్మడు. ఈ ఏడాది తెలుగు, తమిళ్, హిందీలో ఒక్కటంటే ఒక్క మూవీతో పలకరించని పూజా హెగ్డే ప్రస్తుతం తమిళ్ లో ఒకటి తమిళ్ లో రెండు సినిమాలు చేస్తోంది.
Also Read : Pushpa -2 : రెండవ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ భారీ డ్రాప్.. కారణం ఇదే..?
గత రెండేళ్లు టాలీవుడ్‌పై గుర్రుగా ఉన్న పూజా మనసు మార్చుకుని కొత్త మూవీకి కమిటయ్యింది. లక్కీ భాస్కర్‌తో వంద కోట్ల క్లబ్‌లో చేరిన దుల్కర్ సల్మాన్. మరో నయా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో దుల్కర్‌తో ఫస్ట్ టైం జోడి కడుతోంది ఈ కన్నడ కస్తూరి. సర్కార్ వారి పాటకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన రవి ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టబోతున్నాడు. డిసెంబర్ 11న షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఎస్ఎల్వీ సినిమాపై తెరకెక్కుతోందీ ఈ మూవీ. ఈ లెక్కన మూడేళ్ల తర్వాత టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతోంది పూజా. ఈ ఛాన్సుతో మళ్లీ టాలీవుడ్‌లో కెరీర్‌ను కంటిన్యూ చేస్తుందో.. బాలీవుడ్ నుండి రెండు ఆఫర్లు రాగానే మర్చిపోతుందో కాలమే నిర్ణయిస్తుంది.