టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రజంట్ తమిళ స్టార్ విజయ్ సేతుపతితో ఒక మూవీ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్న పూరి.. విజయ్ కోసం ఓ పవర్ ఫుల్ స్టోరి తో రాబోతున్నాడు. కానీ ఈ ప్రాజెక్ట్ పై కోలివుడ్ ప్రేక్షకులు మాత్రం నిరుత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే పూరి జగన్నాథ్ భారీ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. అలాంటి దర్శకుడితో సినిమా ఏంటీ అంటూ విజయ్ అభిమానులు వాపోతున్నారు. కానీ అని రోజులు ఒకేలా ఉండవు కదా.. అదే నమ్మకంతో ఉన్నాడు పూరి. ఇక ఈ మూవీలో నటీనటుల గురించి రోజుకో వార్త వైరల్ అవుతుండగా..
Also Read: Ananya Nagalla : బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన అనన్య నాగళ్ళ!
తాజాగా సమాచారం ప్రకారం ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటించబోతుంది. అదికూడా ఒక సాలిడ్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో కనిపించబోతుందట. అయితే ముందుగా ఈ రోల్ కోసం విజయశాంతిని అనుకున్నారట కానీ ఆమె రాజకీయాల్లో బిజీ గా ఉండటంతో తర్వాత టబు ను అనుకున్నారట. ఎందుకైనా మంచిదని బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్‌ని కూడా లైన్లో పెట్టారట. కానీ ఫైనల్‌గా టబుకి ఫిక్స్ అయ్యారు.. అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంది. ఇక సినీ నటి చార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభమవుతుందని వెల్లడించగా, త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇస్తామని తెలిపింది మూవీ టీం.