టాలీవుడ్ సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలని తక్కువ చేసి చూస్తారు, వాళ్ళకి హీరోయిన్ ఛాన్సులు ఇవ్వరు అనే భావన చాలా మందిలో ఉంది. కానీ హార్డ్ వర్క్, డెడికేషన్ తో కష్టపడితే కచ్చితంగా సక్సెస్ అవుతారు అని కొంతమంది తెలుగు అమ్మాయిలు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్లలో అనన్య నాగళ్ళ ఒకరు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయినప్పటికీ సినిమాపై ఉన్న ఫ్యాషన్‌తో నటిగా మారిన అనన్య నాగళ్ళ కెరీర్ ప్రారంభంలో ‘షాదీ’ వంటి షార్ట్ ఫిల్మ్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత వెంటనే ‘మల్లేశం’, ‘ప్లే బ్యాక్’ అనే సినిమాలో మెప్పించిన అనన్య.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘వకీల్ సాబ్’ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘తంత్ర’, ‘పొట్టేల్’, ‘బహిష్కరణ’(వెబ్ సిరీస్), ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ వంటి ఎన్నో వినూత్నమైన సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
Also Read: Vaishnavi Chaitanya : అందుకే అమ్మాయిలు ఇండస్ట్రీ అంటే భయపడుతున్నారు..
అయితే రూ.5 కోట్ల బడ్జెట్‌లో లేడి ఓరియంటెడ్ సినిమాలు చేస్తే అవి ఈజీగా మార్కెట్ అవుతున్నాయి. అలా అనన్య నటించిన ‘తంత్ర’, ‘పొట్టేల్’, ‘బహిష్కరణ’, ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ వంటివి ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను రాబట్టాయి. అందుకే ఇప్పుడు దర్శకనిర్మాతలు రూ.5 కోట్ల బడ్జెట్ తో తీసే లేడి ఓరియంటెడ్ సినిమాలకు అనన్య నాగళ్ళ బెస్ట్ ఆప్షన్‌గా భావిస్తున్నారు. దీంతో ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతోంది అనన్య. అంతేకాదు తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు బాలీవుడ్ డెబ్యూ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయింది. ఈమె మెయిన్ లీడ్‌గా ఒక హిందీ ప్రాజెక్టు కూడా రూపొందుతుందట. దీని బట్టి ఆమె క్రేజ్, మార్కెట్ రాష్ట్రాలు దాటాయి అని అర్థం చేసుకోవచ్చు.