డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పనితీరుకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. అందుకే జయాపజయాలతో నిమిత్తం లేకుండా హీరోలు, ప్రొడ్యూసర్స్ పూరి జగన్నాథ్ తో వరుసగా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా పూరి జగన్నాథ్ పాన్ ఇండియా మూవీ లైగర్
ను తెరకెక్కిస్తున్నాడు. దీనికి బాలీవుడ్ దర్శక నిర్మాత కరన్ జోహార్ నిర్మాణ భాగస్వామి. అయితే… పూరి పనితీరుకు ఫిదా అయిన కరన్ ఆయనతో మరో మూడు సినిమాలకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అప్పట్లో అందులోని నిజానిజాల గురించి ఎవరూ ఏమీ మాట్లాడలేదు. కానీ ఆ వార్తలు ఒక మేరకు వాస్తవమే అని తెలుస్తోంది. కరన్ జోహార్ తన సొంత బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్ లో ఓ సినిమాకు దర్శకత్వం వహించమని పూరి ని కోరాడట. మరి అందులో హీరోగా నటించే ఛాన్స్ ఎవరికి దక్కుతుందో లేదో తెలియదు కానీ కరన్, పూరి కాంబోలో మరో మూవీ రావడం మాత్రం ఖాయమని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. చాలాకాలంగా పరాజయాలతో ప్రయాణం చేసిన పూరి జగన్నాథ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్
సక్సెస్ కావడంతో తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చేశాడు. అన్నట్టు కొత్త తారలను వెండితెరకు పరిచయం చేయడం అలవాటైన కరన్ జోహార్… పూరి తనయుడు ఆకాశ్ ను పనిలో పనిగా బాలీవుడ్ ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.