టాలీవుడ్ క్రేజీ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కెరీర్ ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ డిజాస్టర్స్ తో డీలా పడిపోయింది. దీంతో ఎలా అయిన మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలి అని, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం.. చాలా మంది హీరోల చుట్టూ తిరిగి చివరికి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో మూవీని ఓకే చేయించుకున్నాడు. ఈ చిత్రాన్ని ఇటీవల అధికారికంగా అనౌన్స్ చేయగా, తెలుగులో కాకుండా పాన్ ఇండియా లెవెల్ చేసేందుకు ఓ బిగ్ స్కెచ్ వేస్తున్నాడు పూరి. ఇప్పటికే ఈ మూవీకి ‘బెగ్గర్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పెట్టినట్లు టాక్ రాగా, అప్పుడే కావాల్సినంత బజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు.ఈ మూవీలో విజయ్ సేతుపతి బిచ్చగాడిగా కనిపించనున్నాడ? అందుకే ఈ టైటిల్ ను పెట్టాడా అనే డౌట్‌లు మొదలయ్యాయి.
మొత్తానికి ఈ సినిమాతో పాత పూరి బయటకు వచ్చేలా కనిపిస్తుంది. ఇక సేతుపతి కోసం బాలీవుడ్ నటి టబు తో పాటు నటి రాధిక ఆప్టే ఈ మూవీ భాగం అవ్వగా. రోజుకో పాత్ర గురించి ఏదో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. మొన్నటి వరకు నివేదా థామస్ పేరు వినపడగా ఇప్పుడు ఈ చిత్రంలో మరో బ్యూటీ నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకున్న నిహారిక గురించి పరిచయం అక్కర్లేదు. స్టార్ హీరోలతో ఇంటర్వ్యూలు. ప్రమోషన్ వీడియోలు చేసి ఫేమ్ అవ్వగా.. రీసెంట్‌గా ‘పెరుసు’ అనే సినిమాలో నటించింది. అయితే, ఇప్పుడు పూరి తన సినిమాలో నిహారికను తీసుకున్నారని టాక్. మరి నిహారిక ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తుందో చూడాలి.