తమిళ దర్శకులలో ప్రేమ్ కుమార్‌కు ప్రత్యేకమైన శైలి ఉంది. ఎందుకంటే, ఆయన ఇప్పటివరకు డైరెక్ట్ చేసింది కేవలం రెండు సినిమాలు మాత్రమే. అవి రెండూ తమిళంలో చెప్పుకోదగ్గ బ్లాక్‌బస్టర్ హిట్లు కావడమే కాక, ఎంతోమంది దర్శకులకు ఒక రకమైన కేస్ స్టడీ లాంటి సినిమాలు. ’96’ మరియు ‘సత్యం సుందరం’ లాంటి సినిమాలతో ఆయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read:Ameerkhan : మణిరత్నంతో మూవీ చేస్తా..
ఆయన సినిమాలు హ్యూమన్ ఎమోషన్స్, బంధాల మధ్య ఉండే అసలైన భావోద్వేగాలపై దృష్టి సారిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇప్పటికే ఆయన ’96’ సినిమాకు సంబంధించిన సీక్వెల్‌పై పనిచేస్తున్నారు. అలాగే, ఆయన దర్శకత్వం వహించిన ‘సత్యం సుందరం’ సినిమా తమిళంలోనే కాక, తెలుగులో కూడా విడుదలై మంచి విజయం సాధించడమే కాక, ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా మంచి ప్రశంసలు అందుకుంది.
Also Read:Thuglife : థగ్ లైఫ్ 3రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?
తాజాగా, ఆయన ఒక తెలుగు సినిమాను సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఏషియన్ సునీల్ బ్యానర్‌లో ఆయన స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. హీరో ఎవరు, ఇతర నటీనటులు ఎవరనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. కానీ, ప్రస్తుతం స్క్రిప్టింగ్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. నిజానికి, ఆయన ఒక స్క్రిప్ట్‌ను పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకుంటారు. కాబట్టి, ఈ సినిమా త్వరలో ప్రారంభమయ్యే అవకాశం లేదు. స్క్రిప్ట్ పూర్తయిన తర్వాతే నటీనటులను ఖరారు చేసే అవకాశం ఉంది.