Thuglife : కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ మూవీ థియేటర్లలో ఆడుతోంది. కానీ కమల్ మూవీకి రావాల్సినంత బజ్ మాత్రం రావట్లేదు. కన్నడ భాషపై చేసిన వివాదాస్పద కామెంట్స్ తో మూవీ చిక్కుల్లో పడింది. కన్నడలో తప్ప మిగతా రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. మూవీకి మొదటి రోజు రూ.15.5 కోట్లు మాత్రమే వచ్చాయి. కమల్ హాసన్ గత సినిమాలలో దేనికీ ఇంత తక్కువ కలెక్షన్లు రాలేదు.
Read Also : Balakrishna: మోస్ట్ వయలెంట్ డైరెక్టర్ తో బాలయ్య?
ఇక రెండో రోజు రూ.7.15 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజు రూ.5.84 కోట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం మూడు రోజుల కలెక్షన్లు కలిపి రూ.28 కోట్లు మాత్రమే వచ్చాయి. వీకెండ్స్ లో కలెక్షన్లు పెరగాల్సింది పోయి.. అత్యంత దారుణంగా పడిపోయాయి. సోమవారం నుంచి ఈ కలెక్షన్లు ఇంకా తగ్గిపోయే ఛాన్స్ ఉంది.
మొత్తంగా కమల్ హాసన్ కెరీర్ లో మరో భారీ డిజాస్టర్ పడిపోయినట్టే అంటున్నారు. మణిరత్నంతో కమల్ హాసన్ చాలా ఏళ్ల తర్వాత చేసిన సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ రొటీన్ కంటెంట్, పేవలమైన స్క్రీన్ ప్లే వల్ల మూవీ అట్టర్ ప్లాప్ అయిపోయింది. బడ్జెట్ రూ.200 కోట్లకు పైగా పెట్టేశామని కమల్ స్వయంగా చెప్పారు. ఇప్పుడు కలెక్షన్లు చూస్తుంటే అందులో సగం కూడా వచ్చేలా లేవు అంటున్నారు ట్రేడ్ పండితులు.
Read Also : SSMB-29 : మహేశ్-రాజమౌళి మూవీ కోసం క్రేజీ యాక్టర్..?