జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం ‘దేవర’. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్
ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా తాజగా వచ్చిన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకోగా అనిరుధ్ మ్యూజిక్ ప్లస్ గా నిలిచింది. దేవర ఈ సెప్టెంబరు 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
Also Read : Devara : దేవర ఆంధ్ర – నైజాం – సీడెడ్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు ఇవిగో..
కాగా దేవర ఒవర్సీస్ అడ్వాన్స్ బుక్కింగ్స్ అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ఇలా బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఆలా హాట్ కేకుల్లాగా అమ్ముడవుతున్నాయి. ఓవర్సీస్ లో మరి ముఖ్యంగా నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ లో – 351 లొకేషన్స్ లో 1023 షోస్ కి గాను $920,068 డాలర్స్ కొల్లగొట్టింది. USA : $860K, Canada : $60K రాబట్టింది. మొత్తంగా నార్త్ అమెరికాలో 1.17 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ఇక టికెట్స్ పరంగా చూస్తే 30k + టికెట్స్ బుక్ అయ్యి రికార్డ్స్ క్రియేట్ చేసింది దేవర. రిలీజ్ కు 17 రోజులు ఉండగానే ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే ప్యూర్ మాస్ అని చెప్పాలి. తాజగా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెరగడంతో బుకింగ్స్ జోరు మరింత ఊపందుకుంది. ఈ మంగళవారం సెన్సార్ చేసుకున్న దేవర U/A సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ తెల్లవారుజామున 1.08 గంటలకు ప్రీమియర్స్ వేస్తున్నారు.