డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన చేసిన కెజీయఫ్, సలార్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాయి. కానీ ప్రశాంత్ నీల్‌కు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అది కూడా తన అభిమాన హీరోతో చేయాలని ఉంది. అది ఇప్పుడు నెరవేరుతోంది. ప్రశాంత్ నీల్ అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్. పలు సందర్భాల్లో ఆయనే ఈ విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు ఆయనతోనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు నీల్.
Also Read: OG Shooting: ముంబయిలో ముగించి.. బెజవాడలో మొదలెట్టాలి?
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే.. అదే సమయంలో ఆర్సీబీ ఈ సీజన్ ఐపీఎల్ కప్ కొట్టింది. ఇది కూడా ప్రశాంత్ నీల్ డ్రీమ్‌లో భాగమే. ఆర్సీబీ టైటిల్ నెగ్గడంతో ప్రశాంత్ నీల్ ఎగిరి గంతేశాడు. ఎన్టీఆర్ సినిమా సెట్‌లో భారీ స్క్రీన్ సెట్ చేసుకొని.. మ్యాచ్‌ను వీక్షించిన ప్రశాంత్ నీల్.. బెంగళూరు విజయం సాధించడంతో భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ వీడియోను ఆయన సతీమణి లికితారెడ్డి ఇన్‌స్టాలో పోస్టు చేశారు.
Also Read: Thug Life : కమల్ థగ్ లైఫ్ ప్రీ రివ్యూ
‘ఈసాలా కప్ నమ్‌దే. 18 ఏళ్ల కల నెరవేరింది. క్రేజియెస్ట్ క్రికెట్ ఫ్యాన్ ప్రశాంత్ నీల్‌కు ఇది పర్‌ఫెక్ట్ గిఫ్ట్’ అంటూ రాసుకొచ్చారు. జూన్ 4 ప్రశాంత్ నీల్ బర్త్‌డే కావడంతో.. ఆయనకు ఆ ఆనందం రెట్టింపు అయింది. అలాగే.. ఇదే ఏడాది ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నాడు కాబట్టి.. ఈ బర్త్ డే ప్రశాంత్ నీల్‌కు చాలా స్పెషల్‌గా నిలిచింది. మొత్తంగా.. ఈసారి నీల్ మావా బర్త్ డేకి రెండు అదిరిపోయే గిఫ్ట్‌లు అందుకున్నాడనే చెప్పాలి. ఇక ఎన్టీఆర్ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా.. 2026 జూన్ 25న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో టైగర్ అరాచకం చూడబోతున్నామని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు.