OG Shooting: ముంబయిలో ముగించి.. బెజవాడలో మొదలెట్టాలి?
- నిన్నటితో OG ముంబయి షెడ్యూలు పూర్తి
- రేపటి నుంచి విజయవాడ షెడ్యూలు మొదలు
- ఈ షెడ్యూలు తో టోటల్ షూట్ పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోందన్న సంగతి తెలిసిందే. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ చిత్రం ముంబాయి షెడ్యూల్ నిన్నటితో (జూన్ 3, 2025) విజయవంతంగా ముగిసింది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించిన చిత్ర యూనిట్, ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్ కోసం సిద్ధమవుతోందని సమాచారం.
Also Read: IND vs PAK: భారత్ అభ్యంతరం.. పాక్‌కు ఏడీబీ బ్యాంక్ $800 మిలియన్ల ప్యాకేజీ..
Also Read
రేపటి నుంచి (జూన్ 5, 2025) విజయవాడలో ఓజీ సినిమా షూటింగ్‌లో చివరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌తో సినిమా టోటల్ షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లుక్,, సుజీత్ మార్క్ డైరెక్షన్‌తో పాటు హై-ఓక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయని అంటున్నారు. ఓజీ చిత్రం డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్నారు.
Also Read: Pawan Kalyan : వీరమల్లు నిర్మాతకు అడ్వాన్స్ తిరిగిచ్చిన పవన్ కల్యాణ్.. !
ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్ లాంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం, గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతూ, అభిమానులకు విజువల్ ట్రీట్‌గా ఉండనుందని టీం చెబుతూతోంది. ముంబాయిలో జరిగిన షూటింగ్‌లో ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలు, కీలక డ్రామా సీక్వెన్స్‌లను చిత్రీకరించినట్లు సమాచారం. ఇప్పుడు విజయవాడ షెడ్యూల్‌లో మిగిలిన కొన్ని క్లైమాక్స్ సన్నివేశాలు, ఇతర ముఖ్యమైన సీన్స్ పూర్తి చేయనున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు ఓజీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!