Thug Life : కమల్ థగ్ లైఫ్ ప్రీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ సంవత్సరం భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో “థగ్ లైఫ్” ఒకటి. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా రేపు (జూన్ 5) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ‘నాయకుడు’ సినిమా తర్వాత దాదాపు 38 ఏళ్లకు ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండడంతో థగ్ లైఫ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read : Pawan Kalyan : వీరమల్లు నిర్మాతకు అడ్వాన్స్ తిరిగిచ్చిన పవన్ కల్యాణ్.. !
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
ఇండియన్ సినిమాలో బిగ్ పవర్ హౌసెస్ కమల్ హాసన్, మణిరత్నం 38 ఏళ్ల తరువాత ఈ సినిమాతో మళ్లీ కలిసి రావడం విశేషం. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘నాయకుడు’ ఇండియన్ సినిమా చరిత్రలో ఓ లెజెండరీ మూవీగా నిలిచిపోయింది. అదే స్థాయిలో ‘థగ్ లైఫ్’పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read : Vedam : అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్..
ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కి హ్యూజ్ రెస్పాన్స్ రాగా.. సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. టీజర్, ట్రైలర్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు మేకర్స్.
ఈ సినిమాలోని శింబు, అశోక్ సెల్వన్, త్రిష కృష్ణన్, అభిరామి లాంటి స్టార్ తారాగణం కీలక పాత్రలు పోషించడం మరింత ఆసక్తిని పెంచుతోంది. తమిళ్‌తో పాటు తెలుగులోను ఈ సినిమాకు సాలిడ్ బజ్ ఉంది. హీరో నితిన్ ఫాదర్ ఎన్. సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన ఈ సంస్థ ఇప్పుడు ‘థగ్ లైఫ్’ని గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. విక్రమ్, అమరన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ నుంచి వస్తున్న థగ్ లైఫ్.. ఆ సంస్థకు హ్యాట్రిక్ విజయాన్ని అందిచడం ఖాయమనే అంచనాలున్నాయి.
ఇక ఈ సినిమాలో కమల్ హాసన్‌తో పాటు శింబు కూడా నటిస్తున్నారు. హీరోగా ఫుల్ బిజీగా ఉన్న శింబు.. కేవలం మణిరత్నం, కమల్ హాసన్ కోసం ఈ సినిమాలో నటించారు. శింబు క్యారెక్టర్ సినిమాలో హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు. అలాగే.. పొన్నియన్ సెల్వన్‌తో కంబ్యాక్ ఇచ్చిన త్రిష ఈ సినిమాలో నటిస్తుండడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. త్రిష కెరీర్‌లో ఇంత వరకు పోషించని ఓ కొత్త పాత్రను ఇందులో పోషిస్తున్నారు. ఇక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ థగ్ లైఫ్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. మణిరత్నం, రెహమాన్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు గతంలో ఎన్నో అద్భుతాలు చేశారు. ఇప్పుడు మరోసారి థగ్ లైఫ్‌తో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఓవరాల్‌గా.. నాయగన్ లాగే మణిరత్నం, కమల్ కెరీర్లో ‘థగ్ లైఫ్’ సినిమా మరో మైలు రాయిగా నిలిచిపోతుందని అభిమానులు భావిస్తున్నారు
తాజావార్తలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
-
BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్‌పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
-
CM Chandrababu : రూ.13.85 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
-
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?