ప్రస్తుతం జనాల ఐడియాలజీ లో చాలా మార్పు వచ్చింది. కరోన కానుండి సినిమా ఇండస్ట్రీ ఇప్పడిపుడే కోలుకుంటుంది. ముఖ్యంగా OTT లు వచ్చిన తర్వాత నిర్మతకు పెద్ద తలనోప్పిగా మారింది. దీంతో ప్రేక్షకులను మెప్పించి థియెటర్ కు రప్పించడానికి నానా తంటాలు పడుతుపన్నారు. ఇక దర్శకులు సైతం సూపర్ సక్సెస్ ను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో సందీప్ రెడ్డి వంగ ఒకరు. ‘అర్జున్ రెడ్డి’ మూవీతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్ని, తర్వాత బాలీవుడ్‌ల్లో ‘అనిమల్’ సినిమాతో అంతకు మించిన సక్సెస్ సాదించాడు. దీంతో బాలీవుడ్ లో సైతం అతనికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. ప్రస్తుతం ఈ జనరేషన్‌లో ఉన్న స్టార్ దర్శకులకు గట్టి పోటీ ఇచ్చేది సందీప్ రెడ్డి వంగ మాత్రమే.
Also Read: Harihara Veeramallu: బరిలోకి దిగిన పవన్ కల్యాణ్..!
ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ ఫ్యాన్ కూడా సందీప్ మీద గట్టి నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే ‘అనిమల్’ మూవీలో రణ్‌బీర్ హీరోయిజం చూసిన తర్వాత.. స్పిరీట్‌లో ప్రభాస్ ని ఇంకేరెంజ్ లో చూపిస్తాడో అనే కుతుహలంతో ఉన్నారు. అయితే ఈ మూవీ గురించి రోజుకో వార్త వైరల్ అవుతున్నాప్పటికి, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ట్యాలెంటెడ్ హీరో గోపీచంద్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య బంధం ఎలాంటిదో మనక తెలిసిందే. గతంలో ‘వర్షం’ మూవీలో ఈ కాంబో చూశాం. ఈ వార్తలో నిజం ఎంతుందో తెలిదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతుంది.