సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న ప్రముఖ తమిళ నటి ప్రియా భవాని శంకర్ ప్రేమలో పడిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించడం విశేషం. ఇటీవల నెటిజన్లతో సంభాషించిన ఈ యంగ్ బ్యూటీ లవ్ మ్యాటర్ ను బయట పెట్టింది. ఓ నెటిజన్ ఆమె వివాహం గురించి ప్రశ్నించగా… దానికి స్పందించిన ప్రియా “నేను ఒక ప్రత్యేక వ్యక్తిని ప్రేమిస్తున్నాను. కానీ నా దృష్టి ప్రస్తుతం నా కెరీర్‌పై ఉంది. సమయం వచ్చినప్పుడు నా వ్యక్తిగత జీవితం గురించి మరిన్ని వివరాలను వెల్లడిస్తాను” అంటూ చెప్పుకొచ్చింది.
Read Also : పోల్ డ్యాన్స్ తో నెటిజన్లను ఫిదా చేస్తున్న జాక్వెలిన్
అయితే తన ప్రియుడు సినీ పరిశ్రమకు చెందినవాడా కాదా అనే విషయాన్ని మాత్రం సస్పెన్స్ లో ఉంచింది. ప్రస్తుతం కమల్ హసన్ “ఇండియన్ 2″లో ప్రియా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. బుల్లితెర ప్రేక్షకులకు ఆమె బాగా తెలుసు. తమిళ టివి సీరియల్స్ లో ఆమె చేసిన పాత్రలకు, నటనకు మంచి గుర్తింపు లభించింది. దీంతో ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై కూడా సక్సెస్ కావాలని భావిస్తోంది ఈ అమ్మడు.