చేసిన సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా ప్రసిద్ధి చెందిన నటి పూనమ్ కౌర్, తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీని ఆమె షేర్ చేసింది. అందులో ఆమె ఇలా అన్నారు: ” ఈ విషయం నేను ముందే చెప్పాను, ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను. నేను త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఈమెయిల్ ద్వారా ఒక ఫిర్యాదు చేశాను. ఝాన్సీ గారితో మాట్లాడాను. మొదట్లో ఆమె బాగానే స్పందించారు, కానీ తర్వాత ఒక మీటింగ్ జరగాల్సి ఉందని, అది జరిగే వరకు తనను ఇబ్బంది పెట్టవద్దని చెప్పడం మొదలుపెట్టారు.
Also Read:A22 x A6: హైదరాబాద్ చేరుకున్న అట్లీ.. ఐకాన్‌స్టార్‌తో ప్రీ-ప్రొడక్షన్ డిస్కషన్స్
నేను ఎవరి పేరు ప్రస్తావించలేదని కొంతమంది అంటున్నారు, కానీ నేను చేసిన ఫిర్యాదులో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరును ప్రస్తావించాను. అతన్ని ఒక రాజకీయ శక్తి కాపాడుతోంది. అలాగే, ఇండస్ట్రీలో చాలా మంది అతనికి మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు నేను కొన్ని మహిళా సంఘాలతో కూడా మాట్లాడబోతున్నాను.” అని ఆమె పెక్రొంది. అంతేకాక, ఝాన్సీ టీమ్‌తో ఆమె జరిపిన సంప్రదింపుల స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది. అందులో పూనమ్ పెట్టిన మెసేజ్ కనిపించడం లేదు.
Also Read:Jayam Ravi : నెలకు రూ.40 లక్షల భరణం ఇవ్వు.. జయం రవి భార్య పిటిషన్..
కానీ సెప్టెంబర్ 28, 2024న టీమ్ ఝాన్సీ అనే అకౌంట్ నుంచి పూనమ్ కౌర్‌ను ఉద్దేశించి ఒక మెసేజ్ వచ్చింది. అందులో, “మీరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక కమిటీ ఏర్పాటు చేశాము. ఆ కమిటీ ముందు మీరు చెప్పాలనుకున్నది అంతా చెప్పండి. అంతేకాక, నాకు ముందు చెప్పాల్సిన అవసరం లేదు,” అని ఝాన్సీ చెప్పినట్లు కనిపిస్తోంది. ఒక మహిళా లాయర్ కమిటీలోకి వచ్చే వరకు వేచి ఉండాలని పూనమ్ కౌర్‌ను కోరారు.