పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడి, కోలుకున్న విషయం తెలిసిందే. అయితే పవన్ కరోనాకు ఇంకా చికిత్స తీసుకుంటున్నారు. మరికొన్ని రోజులు ఆ చికిత్సను కొనసాగించనున్నారు. కరోనా తరువాత పవన్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, పూర్తి ఫిట్‌నెస్‌కి తిరిగి రావడానికి మరికొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం పవన్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. అదే గనక నిజమైతే పవన్ హీరోగా నటిస్తున్న అయ్యప్పనుమ్ కోషియం రీమేక్, హరి హర వీరమల్లు షూటింగ్‌లు కనీసం జూన్ వరకు తిరిగి ప్రారంభం కావనే చెప్పాలి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వేగంగా వ్యాపిస్తున్న కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జన సైనికులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటున్నారు పవన్.