పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొక పక్క రాజకీయాలు కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, నిజానికి ఆయన ఒప్పుకున్న సినిమాలు మాత్రమే పూర్తి చేస్తాడని అనుకున్నారు. అందులో భాగంగా ముందు హరి హర వీరమల్లు, తర్వాత ఓజి, ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాల షూటింగ్స్ ఆయన పూర్తి చేశారు. ఇక సినిమాలకు బ్రేక్ తీసుకుంటారు అని అనుకుంటున్న సమయంలోనే ఆయన దిల్ రాజుకి డేట్స్ ఇచ్చారనే వార్త ఒక్కసారిగా వైరల్ అయింది. అయితే, తాజాగా దిల్ రాజు మాత్రమే కాదు మరో ముగ్గురు నిర్మాతలకు కూడా ఆయన డేట్స్ ఇచ్చారు అనే అంటున్నారు.
Also Read :Peddi Exclusive :’పెద్ది’ 60 % కంప్లీట్.. రేపటి నుంచి అక్కడ సాంగ్ షూట్!
అయితే, ఈ విషయంలో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు. కానీ, ఫిలిం నగర్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు దిల్ రాజు తో పాటు ఆయన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ తో పాటు ఎస్ఆర్డి ఎంటర్టైన్మెంట్స్ అధినేత, ఇటీవల జనసేనలో కీలక పదవి పొందిన రామ్ తాళ్లూరికి డేట్స్ ఇచ్చినట్లుగా సమాచారం. ఇక వీరితో పాటు మరో నిర్మాతకు కూడా ఆయన డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. కానీ, ఆ నిర్మాత ఎవరనే విషయం మాత్రం బయటికి రాలేదు. ఇక పవన్ కళ్యాణ్ ఈమధ్య కాలంలోనే జరిగిన ఓజి సక్సెస్ మీట్ లో తాను ఓజి సినిమా సీక్వెల్ తో పాటు ప్రీక్వెల్ కి కూడా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు పేర్కొనడంతో ఆయన అదే నిర్మాణ సంస్థ అయిన డివివి ఎంటర్టైన్మెంట్స్ అధినేత డివివి దానయ్యకి కూడా డేట్స్ ఇచ్చి ఉంటారు అనే ప్రచారం జరుగుతోంది. కానీ, ఆ విషయం మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు. మొత్తం సినిమాలు మానేస్తాడు అనుకున్న పవన్ కళ్యాణ్ ఇలా వరుస డేట్లు కేటాయించడం ఆసక్తి రేకెత్తిస్తోందని చెప్పాలి.